close

తాజా వార్తలు

Updated : 27/03/2020 04:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాకు రూ.100 కోట్లిచ్చిన బజాజ్‌ గ్రూపు

పుణెలో కొవిడ్‌-19కు అడ్డుకట్టవేయడానికి కావలసిన కీలక ఆరోగ్య సంరక్షణ మౌలిక వసతులను అభివృద్ధి చేయడానికి రూ.100 కోట్లతో నిధిని ఏర్పాటు చేసినట్లు బజాజ్‌ గ్రూప్‌ తెలిపింది. అదే సమయంలో కార్మికులు, ఇల్లు లేనివారు, వీధి పిల్లలకు తక్షణం సహాయం చేయనున్నట్లు గ్రూప్‌ అధిపతి రాహుల్‌ బజాజ్‌ ప్రకటించారు.

క్లుప్తంగా..
* ఎయిరిండియాకు చెందిన రూ.700 కోట్ల నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్లకు ప్రభుత్వం రీఫైనాన్స్‌ ప్రకటించింది. కొన్ని బ్యాంకుల నుంచి స్వల్పకాల రుణాల ద్వారా ఈ రుణాలకు పూర్తి స్థాయిలో రీఫైనాన్స్‌ లభించిందని ఎయిరిండియా వర్గాలు వెల్లడించాయి. ఫలితంగా రుణ ఎగవేతను నివారించినట్లు అయ్యింది.
* డియాజియోకు చెందిన యునైటెడ్‌ స్పిరిట్స్‌ గురువారం తన తయారీ ప్లాంటును మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతానికి కరోనా కారణంగా ఎంత మేర ఆర్థిక ప్రభావం ఉంటుందన్న విషయాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని కంపెనీ తెలిపింది.
* వాటా విక్రయాల ద్వారా రూ.5,000 కోట్ల మేర నిధులను సమీకరించడానికి బోర్డు అనుమతించిందని యెస్‌ బ్యాంకు తెలిపింది. మరో పక్క, బ్యాంకు ఎండీ, సీఈఓగా ప్రశాంత్‌ కుమార్‌ అధికారికంగా నియమితులయ్యారు. దీంతో కొత్త బోర్డు అమల్లోకి వచ్చినట్లయింది.

* ఏప్రిల్‌ 14 వరకు తయారీ కార్యకలాపాలను నిలిపివేయనున్నట్లు థెర్మాక్స్‌ తెలిపింది. అంతక్రితం మార్చి 31, 2020 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

* గుజరాత్‌కు చెందిన సుజుకీ మోటార్‌ గుజరాత్‌(ఎస్‌ఎమ్‌జీ) తన ప్లాంటు కార్యకలాపాల నిలిపివేతను ఏప్రిల్‌ 14 వరకు కొనసాగిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది.

* మొబైల్‌ తయారీ సంస్థ లావా తమ సిబ్బందికి 20 శాతం వేతనాన్ని ముందస్తుగా అందచేయనున్నట్లు ప్రకటించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో, 3500 మంది సిబ్బంది సురక్షితంగా ఉండేందుకు, 12 రోజుల ముందుగానే వేతనం చెల్లించినట్లు సంస్థ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.