close

తాజా వార్తలు

Updated : 27/03/2020 17:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చెర్రీ ఈరోజునే ఎందుకు పుట్టాడో అర్థమైంది : చిరు

మెగా పవర్‌స్టార్‌ బర్త్‌డే సాంగ్‌ విన్నారా..!

హైదరాబాద్‌: మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మార్చి 27 (ప్రపంచ రంగస్థల దినోత్సవం)న ఎందుకు పుట్టాడో తనకి కొంతకాలనికి  అర్థమైందని చిరంజీవి అన్నారు. నేడు రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌ వేదికగా చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ‘రామ్‌ చరణ్‌ పుట్టినప్పుడు నేను ఎంతో సంతోషించాను. మార్చి 27.. ప్రపంచ రంగస్థల దినోత్సవం. ఆ రోజున రామ్‌చరణ్ జన్మించడానికి గల కారణం ఆ తర్వాత నాకు అర్థమైంది. చేపలకు ఈతలా అతను నటనను స్వీకరించాడు. ఈ పండుగ రోజున హ్యాపీ బర్త్‌డే చరణ్‌’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు. ఇదిలా ఉండగా టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం సోషల్‌మీడియా వేదికగా చెర్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రామ్‌చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ అభిమాని స్పెషల్‌ సాంగ్‌ అలపించారు. ఆ పాటకు సంబంధించిన వీడియోను ఉపాసన, కాజల్‌, తమన్నా, అనసూయ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

 ‘నా బావ రామ్‌చరణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో మరెన్నో విజయాలను, సంతోషాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈరోజు నిన్ను కలవాలని అనుకున్నాను. కానీ ఓ మంచి పని కోసం మనందరం ఇళ్లకే పరిమితమయ్యాం’ - అల్లు అర్జున్‌

‘చిరుత సినిమా కోసం రామ్‌చరణ్‌తో కలిసి పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉంది. నేను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో నాకు ఈ అవకాశాన్ని కల్పించిన నా గురూజీ పూరి జగన్నాథ్‌కు ధన్యవాదాలు. హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌. నీకు మరింత సంతోషం, విజయం అందాలని కోరుకుంటున్నాను. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా నువ్వు చాలా మందిలో  స్ఫూర్తి నింపావు.’ - హరీశ్‌ శంకర్‌

‘హ్యాపీ బర్త్‌డే మిత్రమా.. మంచి మనసున్న నువ్వు వందేళ్లపాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. లవ్‌ యూ బాబాయ్‌. వెల్‌కమ్‌ టు ట్విటర్‌’ - మంచు మనోజ్‌

‘యువ సింహానికి హ్యాపీ బర్త్‌డే. ప్రతిఒక్కరి పట్ల నువ్వు చూపించే వినయం, ఆత్మీయత ఎంతో మనోహరమైనవి. దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ నీతో ఉండాలని కోరుకుంటున్నాను’ - ప్రసాద్‌ వి. పొట్లూరి

‘హ్యాపీ బర్త్‌డే రామ్‌చరణ్‌. మీకు దేవుడు మంచి ఆరోగ్యం, సంతోషం అందించాలని కోరుకుంటున్నాను. మనందరం కలిసి చిన్నప్పుడు టూర్‌కు వెళ్లినప్పుడు తీసుకున్న ఓ అపురూపమైన చిత్రమిది’ - సాయి తేజ్‌

‘చిరంజీవి రామ్‌చరణ్‌ తేజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు’ - కీరవాణి

‘స్వచ్ఛమైన హృదయం, సూపర్‌ టాలెంటెడ్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రానికి నా అభినందనలు’ - బాబీ

సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి వస్తోన్న బర్త్‌డే విషెస్‌పై రామ్‌చరణ్‌ స్పందించారు. ‘అర్ధరాత్రి నుంచి మీరు పంపిస్తున్న బర్త్‌డే విషెస్‌ చూసి నేను ఎంతో సంతోషించాను. మీ అందరి ప్రేమాభిమానులు చూశాక.. నేను మీ నుంచి ఒక గిఫ్ట్‌ పొందాలనుకుంటున్నాను. లాక్‌డౌన్‌ పూర్తయ్యేవరకూ మీ అందరూ ఇంట్లోనే ఉండండి. అదే మీరు నాకిచ్చే పెద్ద బహుమతి’ అని చెర్రీ పేర్కొన్నారు.

 

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.