మాస్కులు కుడుతున్న శాస్త్రవేత్త
close

తాజా వార్తలు

Published : 30/03/2020 01:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాస్కులు కుడుతున్న శాస్త్రవేత్త

మె ఓ వ్యవసాయ శాస్త్రవేత్త. కూతురు ఐఏఎస్‌ అధికారిణి. ప్రస్తుతం కరోనా మహమ్మారి వల్ల దేశం మొత్తం లాక్‌డౌన్‌ అయ్యింది. ఈ కష్టకాలంలోనూ తన వంతుగా సమాజానికి సేవ చేయాలని భావించారామె. పారిశుద్ధ్య కార్మికుల కోసం మాస్కులు కుడుతూ పదిమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కరోనాపై యుద్ధంలో వరంగల్‌ మహానగర పాలక సంస్థ కమిషనర్‌ పమేలా సత్పతి తల్లి ప్రభ భాగస్వామయ్యారు. వీళ్ల స్వస్థలం ఒడిశా. పీహెచ్‌డీ పూర్తి చేసిన ప్రభ... కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఈ మధ్యే కూతురు దగ్గరికి వచ్చారు. వరంగల్‌ రాగానే దేశమంతా లాక్‌డౌన్‌ అయ్యింది. ప్రభకు టైలరింగ్‌ హాబీ. పారిశుద్ధ్య కార్మికులకు మాస్కుల కొరత ఉండడంతో మాస్కులు కుట్టాలని ఆమెను కూతురు కోరింది. వెంటనే సుమారు 200 మాస్కులు స్వయంగా కుట్టి కూతురుకు అందజేశారు ప్రభ. మరిన్ని కుడుతున్నారు. ‘అమ్మా నువ్వు నాకు అనేక విధాలా స్ఫూర్తి అందిస్తున్నావ’ంటూ కమిషనర్‌ తన తల్లి మాస్కులు కుడుతున్న ఫొటోను ట్విటర్‌లో పంచుకోగా...మంత్రి కేటీఆర్‌ ‘గొప్ప పని మేడం’ అంటూ హర్షించారు.

- ఈనాడు, వరంగల్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని