
తాజా వార్తలు
సమస్యలకు వాట్సాప్‌లో బదులిస్తున్న కంపెనీలు
సేవా కేంద్రాలు మూసివేసిన నేపథ్యం
దిల్లీ: కరోనా లాక్డౌన్ నేపథ్యంలో, సేవా కేంద్రాలు (సర్వీస్ సెంటర్లు) మూసివేసిన నేపథ్యంలో, తమ కొనుగోలుదార్ల సందేహాలకు సామాజిక మాధ్యమాలు, ఇతర ఆన్లైన్ సాధనాల ద్వారా కంపెనీలు పరిష్కారాలు చూపేందుకు ప్రయత్నిస్తున్నాయి. సోనీ, శామ్సంగ్, పానసోనిక్, హైయర్, గోద్రేజ్ అప్లయన్సెస్ వంటి కంపెనీలు వైవ్ఛాట్, వాట్సాప్, డీఐవై వీడియో వంటి మాధ్యమాలతో పాటు ఆన్ కాల్ అసిస్టెన్స్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఖాతాదార్లతో సంభాషిస్తున్నాయి. ‘వాట్సాప్ వీడియోకాల్స్ ద్వారా సమస్య తెలుసుకుంటున్నాం. వీడియోలు చూపడం ద్వారా, కొన్ని సమస్యలను పరిష్కరించగలుగుతున్నాం. చిన్న, చిన్న మార్పులు ఏమైనా చేయాలంటే, వినియోగదారులే చేసుకునేలా విశదీకరిస్తున్నాం’ అని గోద్రేజ్ అప్లయన్సెస్ వ్యాపారాధిపతి కమన్ నంది తెలిపారు. ఏసీలను సొంతగా శుభ్రం చేసుకునేలా వీడియోలు సిద్ధం చేశమని పానసోనిక్ ఇండియా ప్రతినిధి వెల్లడించారు. సోనీ ఇండియా కాల్ సెంటరు కూడా మూసివేసినందున, ఐవీఆర్ మెసేజ్ ద్వారా, సంబంధిత వెబ్ పేజీకి చేరేలా వినియోగదారులకు సూచనలు చేస్తోంది. అందులోంచి లైవ్‌ఛాట్ ద్వారా సంస్థ ప్రతినిధి వినియోగదారులకు సహకరిస్తున్నారని సోనీ ఇండియా ప్రతినిధి తెలిపారు. శామ్సంగ్ కూడా లైవ్‌ఛాట్ ద్వారానే సందేహాలు తెలపాలని వినియోగదారులను కోరింది. హైయర్ అయితే వాట్సాప్, లైవ్‌ఛాట్, కేర్లైన్ ద్వారా కూడా సందేహాలు తీరుస్తోంది. హైయర్ సంస్థ అయితే అన్ని ఉత్పత్తుల పైనా వారెంటీని లాక్డౌన్ తొలగించాక, 2 నెలల వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసింది
- మరో 6 పరుగులు చేసుంటే..
- నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్
- సమాధానం కావాలా..నీ దేశానికి వెళ్లిపో
- గబ్బా కాదు..శార్దూల్-సుందర్‌ల దాబా: సెహ్వాగ్
- ఆ వార్తల్లో నిజం లేదు.. మోహన్‌బాబు టీమ్
- ‘ఉప్మాపాప’కు థాంక్స్ చెప్పిన రామ్..
- యాష్ లేకున్నా సుందర్ నష్టం చేశాడు: ఆసీస్
- బైడెన్ తొలి సంతకం వీటిపైనే..!
- టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్ 336 ఆలౌట్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
