close

తాజా వార్తలు

Published : 30/03/2020 22:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్పెయిన్‌లో ఒక్కరోజే 812 మరణాలు

మాడ్రిడ్‌: స్పెయిన్‌లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాలుస్తుంది. దీంతో ఆ దేశంలో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతున్నాయి. సోమవారం ఒక్క రోజే 812 మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో ఆ దేశంలో మరణాల సంఖ్య 7,340, వ్యాధి సోకిన వారి సంఖ్య 85,195కి చేరింది. ఆదివారంతో పోలిస్తే కరోనా సోకిన వారి సంఖ్య 8 శాతం, మరణాల శాతం 12.4 పెరిగింది. వ్యాధిసోకిన వారి సంఖ్య, మరణాల సంఖ్య వృద్ధిరేటు నెమ్మదిగా పెరుగుతుందని అధికారులు తెలిపారు. కరోనా విజృంభణ తీవ్రమవుతున్న దృష్ట్యా అక్కడి ప్రభుత్వం ఆంక్షల్ని మరింత కఠినతరం చేసింది. ప్రజల్ని నియంత్రించే బాధ్యత పూర్తిగా సైన్యానికి అప్పగించింది. ఈ క్రమంలో వారికి అత్యవసర అధికారాల్ని కట్టబెట్టింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.