close

తాజా వార్తలు

Updated : 30/03/2020 21:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. రైస్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా తెలంగాణ: కేసీఆర్‌

రాష్ట్రంలోని రైస్‌ మిల్లర్లతో చర్చలు జరిపి తెలంగాణ సమగ్ర ధాన్యం, బియ్యం విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. రైస్‌ మిల్లర్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. వరి పంట సాగు, ధాన్యం దిగుబడులు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఒక్క కాళేశ్వరం ద్వారానే 35 లక్షలకుపైగా ఎకరాల్లో వరి పంట పండే అవకాశముంది. ప్రపంచమంతా కరువు వచ్చినా తెలంగాణలో మాత్రం రాదు. వచ్చే ఏడాది కనీసం 70 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం రైస్‌ బౌల్ ఆఫ్‌ ఇండియాగా మారుతుంది’’ అని కేసీఆర్‌ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* తెలంగాణలో వేతనాల కోత

 

2. కరోనా ఇంకా స్థానిక వ్యాప్తి దశలోనే: కేంద్రం

కరోనా వైరస్‌ ప్రభావం స్థానిక వ్యాప్తి దశలోనే ఉందని కేంద్రం స్పష్టంచేసింది. ఇంకా సమూహ వ్యాప్తి దశకు చేరుకోలేదని తెలిపింది. ఒకవేళ సమూహ వ్యాప్తి దశకు చేరుకున్నప్పుడు ఆరోగ్య శాఖ ఆ విషయాన్ని వెల్లడిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ చెప్పారు. ప్రస్తుతానికి మనం ఆ దశకు చేరుకోలేదని తెలిపారు. ‘‘మన దేశంలో జనసాంధ్రత ఎక్కువ. ప్రతి ఒక్కరూ భౌతిక దూరాన్ని అనుసరిస్తేనే కరోనాను అరికట్టగలం. వంద శాతం ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రజలు పాటించాలి. కేంద్ర రాష్ట్రాలు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి. ఏ మాత్రం అనుమానం ఉన్నా కాల్‌ సెంటర్లను సంప్రదించాలి.’’ అని లవ్‌ అగర్వాల్‌ వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

కరీంనగర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయినట్టు జిల్లా కలెక్టర్‌ శశాంక వెల్లడించారు. ఇటీవల ఇండోనేషియాకు చెందిన కొంతమంది కరీంనగర్‌కు వచ్చిన సంగతి తెలిసిందే. వారందరికీ కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తేలింది. వారితో తిరిగిన వ్యక్తికి కూడా గతంలో కరోనా పాజిటివ్‌ వచ్చింది. తాజాగా ఆ వ్యక్తి సోదరి, తల్లికి కరోనా సోకినట్లు కలెక్టర్‌ తెలిపారు. ఆ ముగ్గురిని కలిసిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపట్టామని, వారితో సన్నిహితంగా తిరిగిన వారి వివరాలు సేకరిస్తున్నామని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* రేపటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు

4. అప్పుడు రూ.200 కూడా లేవు.. ఇప్పుడు...

కరోనాపై పోరాటం చేసేందుకు తమవంతు సాయం చేయాలని ప్రధాని మోదీ ప్రకటించిన వెంటనే  పీఎం-కేర్స్‌ ఫండ్‌కు రూ.25 కోట్ల భారీ విరాళం అక్షయ్‌ ప్రకటించారు. భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఒక వ్యక్తి అత్యధికంగా ఇచ్చిన విరాళం ఇదే. చిత్ర పరిశ్రమలో అందరూ తమవంతు సాయం చేస్తూ కరోనాపై పోరాడుతున్న వేళ, అక్షయ్‌ ప్రకటించిన విరాళం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.  ‘‘నేను ముంబయికి వచ్చిన కొత్తలో నా జేబులో కనీసం రూ.200 కూడా ఉండేవి కాదు. కానీ ఇవాళ నా దగ్గర ఎంతో ఉంది’’ అని అక్షయ్‌ గుర్తు చేసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* మళ్లీ ‘శక్తిమాన్‌’

5. కరోనాపై పోరుకు మీ సహకారం కావాలి: మోదీ 

కరోనా (కొవిడ్-19) వైరస్‌పై పోరులో సామాజిక సేవా సంస్థల సహకారం ఎంతో అవసరమని ప్రధాని  నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశం అపారమైన పోరాటపటిమను, మనోధైర్యాన్ని, సహానాన్ని ప్రదర్శిస్తోందని ప్రధాని పేర్కొన్నారు. సోమవారం సామాజిక సంక్షేమ కార్యకర్తలు, సేవా సంస్థల ప్రతినిధులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘ప్రస్తుతం దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ఇటువంటి సమయంలో సామాజిక సంక్షేమ సంస్థల సేవలు దేశ ప్రజలకు ఎంతో అవసరం’’అని అన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తెలంగాణ సీఎం సహాయ నిధికి విరాళాల వెల్లువ

కరోనా మహమ్మారిపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సమరానికి ప్రముఖ సంస్థలతో పాటు కొందరు ప్రముఖులు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం సహాయ నిధికి విరాళాలు అందించడం ద్వారా తమ ఉదారతను చాటుకుంటున్నారు. ఈ రోజు ఒక్క రోజే తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.13 కోట్ల విరాళం అందింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సచిన్‌నే ఎంచుకుంటా: షేన్‌ వార్న్‌

ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ప్రత్యర్థులపై పైచేయి సాధించే బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోమంటే దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ను ఎంచుకుంటానని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ షేన్‌ వార్న్‌ అన్నాడు. సోమవారం వార్న్‌ ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించాడు. అతడు ఆడిన సమయంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ గురించి మాట్లాడాడు. ‘‘ఎలాంటి పరిస్థితుల్లోనైనా సత్తాచాటే బ్యాట్స్‌మన్‌ను ఎంచుకోవాలంటే.. సచిన్, లారాలో ఎవరిని ఎంపిక చేయాలని కాస్త తడబడతా. అయితే నేను సచిన్‌నే ఎంచుకుంటా. అదే టెస్టు ఆఖరి రోజు 400 పరుగులు చేయాల్సి వస్తే లారాను తీసుకుంటా. ఇద్దరూ అద్భుతమైన ఆటగాళ్లు’’ అని వార్న్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. క్వారంటైన్‌లోకి ఇజ్రాయిల్‌ ప్రధాని  

 ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనావైరస్‌ దేశాధినేతలను విడిచిపెట్టడంలేదు. తాజాగా ఇజ్రాయిల్‌ ప్రధానమంత్రి బెంజిమన్‌ నెతన్యాహు ప్రధాన సహాయకుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ముందస్తు చర్యగా ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లారు. గతవారం పార్లమెంట్‌ సెషన్స్‌కు హాజరైన బెంజిమన్‌ ప్రతిపక్షసభ్యుల సలహాలు తీసుకుని కరోనా మహమ్మారిని ఎలా ఎదుర్కొనాలనే దానిపై ప్రణాళిక చేశారు. ఆయన సహాయకుడికొ కరోనా ఛాయలు కనిపించడంతో ఆయనతో పాటు మిగతా సహాయక సిబ్బంది కూడా ఐసోలేషన్‌కు వెళ్లినట్టు స్థానిక మీడియా జెరూసలెం పోస్టు తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌.. స్పెయిన్‌ కొంపముంచింది..

కరోనా వైరస్‌తో యూరప్‌ చిగురుటాకులాగా వణికిపోతోంది. ఇటలీ, స్పెయిన్‌, ఇంగ్లాండ్‌.. తదితర దేశాల్లో మరణాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఎక్కువగా మరణాలు సంభవించిన ఇటలీ తరువాత స్పెయిన్‌లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇందుకు అనేక కారణాలు దోహదం చేశాయని వైద్య విశ్లేషకులు తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పీఎం-కేర్స్‌కు రిలయన్స్‌ రూ.500 కోట్లు

కరోనా మహమ్మారిపై పోరుకు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) తన వంతు సాయానికి ముందుకొచ్చింది. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపు మేరకు పీఎం- కేర్స్‌ ఫండ్‌కు రూ.500 కోట్లు విరాళంగా ప్రకటించింది. మహారాష్ట్ర, గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు చెరో రూ.5 కోట్లు విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. దీంతో పాటు కొవిడ్‌-19 బాధితులకు సేవలందించేందుకు రెండు వారాల్లో 100 పడకలతో ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్‌ ఫౌండేషన్‌తో కలిసి పలు సేవలు అందించనున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.