close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 02/04/2020 01:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హద్దులు లేని అవకాశాలు

పర్యాటకరంగం కోర్సులు
ఐఐటీటీఎం ప్రకటన విడుదల

పర్యాటకం.. ప్రపంచ వ్యాప్త రంగం. నైపుణ్యం ఉంటే అవకాశాలకు హద్దే లేదు. అవసరమైన కోర్సులు పూర్తిచేసిన వారిని మన దేశంతోపాటు విదేశీ సంస్థలూ నియమించుకుంటున్నాయి. ఈ ఉద్యోగాల్లో చేరితే పలు ప్రాంతాలూ, దేశాలూ చుట్టిరావచ్చు. ఎన్నో సంస్కృతులతోనూ, వ్యక్తులతోనూ పరిచయాలు పెంచుకోవచ్చు.

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం) బీబీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. నెల్లూరుతో సహా దేశవ్యాప్తంగా పలు క్యాంపస్‌ల్లో వీటిని అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభ, బృంద చర్చ, ముఖాముఖి ద్వారా ప్రవేశం లభిస్తుంది.

దేశంలో పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఇందులో సేవలు అందించడానికి నాణ్యమైన మానవ వనరులను తయారుచేసేందుకు నెల్లూరు, గ్వాలియర్‌, భువనేశ్వర్‌, నోయిడాల్లో ఐఐటీటీఎంలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులను అందిస్తున్నారు. వీటిని ఇందిరా గాంధీ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం, అమరాంతక్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సంస్థల్లో చదువుల కోసం ఫీజులు చెల్లించడానికి పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు రుణసదుపాయం కల్పిస్తోంది. వివిధ వర్గాలకు చెందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు లభిస్తున్నాయి. కోర్సులు పూర్తిచేసుకున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు పర్యాటక సంస్థలు, రిసార్టులు, క్యాటరింగ్‌, విమానయాన సంస్థలు, హోటళ్లు, ఆతిథ్యంతో ముడిపడే ఇతర సంస్థల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకుంటున్నారు. ఇక్కడి విద్యార్థులను క్యాంపస్‌ నియామకాల ద్వారా మేక్‌ మై ట్రిప్‌, యాత్రా, ఐఆర్‌సీటీసీ, మారియట్‌, షెరటాన్‌, బామర్‌ లారీ, హాలిడే ఇన్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, హ్యాపీటూర్‌ తదితర సంస్థలు ఎంపిక చేసుకుంటున్నాయి.

కోర్సుల వివరాలు
* ఎంబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌
సీట్లు: ఈ కోర్సులో మొత్తం 750 సీట్లు ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిగ్రీలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీలైతే 45 శాతం.ప్రస్తుతం ఆఖరు సంవత్సరం డిగ్రీ చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: జులై 1, 2020 నాటికి 27 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్ల వయసు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో చూపిన ప్రతిభ, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ద్వారా.
పరీక్షకు 70 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది. మ్యాట్‌, క్యాట్‌, సీమ్యాట్‌,  గ్జాట్‌, జీమ్యాట్‌, ఆత్మా వీటిలో ఏదో ఒక పరీక్షలో స్కోర్‌ సాధించినవారికి ప్రవేశ పరీక్ష నుంచి మినహాయింపు లభిస్తుంది. మిగిలినవారు ఐఐటీటీఎం నిర్వహించే ప్రవేశ పరీక్షకు హాజరుకావాలి.

* బీబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌
సీట్ల సంఖ్య: అన్ని క్యాంపస్‌ల్లోనూ కలిపి మొత్తం 375 సీట్లు ఉన్నాయి.
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 45 శాతం. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ద్వారా.
ప్రవేశ పరీక్షకు 70 శాతం, గ్రూప్‌ డిస్కషన్‌కు 15 శాతం, ఇంటర్వ్యూకు 15 శాతం వెయిటేజీ ఉంటుంది.

పరీక్ష విధానం
బీబీఏ, ఎంబీఏ రెండు కోర్సులకూ ప్రవేశ పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. కానీ ప్రశ్నల స్థాయిలో వ్యత్యాసం ఉంటుంది. పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. జనరల్‌ అవేర్‌నెస్‌ 50, వెర్బల్‌ ఎబిలిటీ 25, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 25 ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. ఓఎంఆర్‌ పత్రంపై సమాధానాలను గుర్తించాలి. రుణాత్మక మార్కులు లేవు.
దరఖాస్తులకు చివరి తేదీ: మే 29, 2020.
పరీక్ష తేదీ: జూన్‌ 7, 2020.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం: నెల్లూరులో ఉంది.
వెబ్‌సైట్‌: www.iittm.ac.in


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.