close

తాజా వార్తలు

Published : 06/04/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పీహెచ్‌డీకి ఆహ్వానం

మలేరియా రిసెర్చి సంస్థ ప్రవేశ ప్రకటన

పరిశోధనపై ఆసక్తి ఉన్నవారికి న్యూదిల్లీలోని ప్రముఖ సంస్థ ఐసీఎంఆర్‌- నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మలేరియా రిసెర్చ్‌ (ఎన్‌ఐఎంఆర్‌) ఆహ్వానం పలుకుతోంది. పీహెచ్‌డీ ప్రోగ్రాముకు సంబంధించి ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. జీవశాస్త్ర (బయాలజీ) నేపథ్యం ఉన్నవారికే అవకాశం కల్పిస్తోంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

యాలజీ నేపథ్యం ఉండి, పరిశోధానసక్తి, కుతూహలం ఉన్న విద్యార్థుల నుంచి పీహెచ్‌డీ ప్రోగ్రాంలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.. సుప్రసిద్ధ సంస్థ అయిన ఎన్‌ఐఎంఆర్‌. దీన్ని విజయవంతంగా పూర్తిచేసినవారికి అకాడమీ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇన్నవేటివ్‌ రిసెర్చ్‌ (ఏసీఎస్‌ఐఆర్‌) నుంచి డిగ్రీ సర్టిఫికెట్‌ అందజేస్తారు. మొత్తం సీట్ల సంఖ్య 41.

రిసెర్చ్‌ అంశాలు: బయోకెమిస్ట్రీ, స్ట్రక్చరల్‌ బయాలజీ, బయోస్టాటిస్టిక్స్‌, బయోఇన్ఫర్మాటిక్స్‌, డ్రగ్‌ డిస్కవరీ, డ్రగ్‌ రెసిస్టెన్స్‌, ఎంటమాలజీ, ఎపిడెమియాలజీ, ఇమ్యునాలజీ, మైక్రోబయాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, సెల్‌ బయాలజీ, బయోఫిజిక్స్‌, కంప్యూటేషనల్‌ బయాలజీ.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ (www.nimr.org.in) లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.300ను డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఎస్‌సీ, ఎస్‌టీ, డిజేబుల్డ్‌ వారికి పరీక్ష ఫీజులో మినహాయింపు ఉంది. పూర్తిచేసిన దరఖాస్తు ఫారంతోపాటు డీడీని డైరెక్టర్‌-ఎన్‌ఐఎంఆర్‌ పేరుమీదుగా పంపాల్సి ఉంటుంది.

ఎంపిక: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను వ్యక్తిగత ఇంటర్వ్యూ నిమిత్తం పిలుస్తారు. దానిలో అర్హత సాధించినవారికి ప్రవేశం కల్పిస్తారు.

అర్హత: లైఫ్‌సైన్సెస్‌/ బయోకెమిస్ట్రీ/ మైక్రోబయాలజీ/ ఎంటమాలజీ/ బయోటెక్నాలజీ/ జెనెటిక్స్‌/ కెమిస్ట్రీ/ ఫిజిక్స్‌/ బయోఫిజిక్స్‌/ మేథమేటిక్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటేషనల్‌ బయాలజీ/ బయోస్టాటిస్టిక్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులతోపాటు బయాలజీపై ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్ఛు బయలాజికల్‌ సైన్సెస్‌లో ఎంఎస్‌సీ, ఎంటెక్‌, బీటెక్‌, బీఫార్మసీ/ బీఈ/ ఎంబీబీఎస్‌/ ఎండీ చేసినవారు అర్హులు. 60% మార్కులు లేదా తత్సమాన సీజీపీఏ సాధించి ఉండాలి. ఎస్‌సీ/ ఎస్‌టీ వారికి 55% కనీసం సాధించి ఉండాలి. చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్ఛు అడ్మిషన్‌ సమయానికి సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

వయసు: ఫిబ్రవరి 10, 2020నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, డిజేబుల్డ్‌ వారికి అయిదేళ్లు, ఓబీసీ వారికి మూడేళ్లు వయఃపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణకు చివరితేదీ: ఏప్రిల్‌ 30, 2020

ఇంటర్వ్యూలు: జులై చివరి వారంలో.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

చిత్ర వార్తలు

మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.