close

తాజా వార్తలు

Published : 07/04/2020 13:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చైనాలో ‘సున్నా’ మరణాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ఉద్ధృతిని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 208 దేశాలకు పాకిన ఈ మహమ్మారి 13,47,803 మందికి సోకింది. వీరిలో 74,807 మందిని పొట్టనబెట్టుకుంది. అయితే ఐరోపా దేశాల్లో రోజువారీ మరణాల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టడం ఊరట కలిగిస్తోంది. అలాగే చైనాలో సోమవారం మరణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం ఆశలు రేకెత్తిస్తోంది. 

* చైనాలో సోమవారం ఒక్క మరణం కూడా సంభవించలేదని అక్కడి అధికారులు వెల్లడించారు. జనవరిలో అధికారిక లెక్కలు ప్రకటించడం ప్రారంభించిన నాటి నుంచి ఒక్కరు కూడా మృతిచెందకపోవడం ఇదే తొలిసారి. అయితే విదేశాల నుంచి వస్తున్న బాధితుల సంఖ్య మాత్రం క్రమంగా పెరుగుతోంది. నిన్న మరో 38 మందిలో వైరస్‌ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ దేశంలో బాధితుల సంఖ్య 81,740కి చేరింది. ఇక మృతుల సంఖ్య 3,331 వద్ద ఉంది. 

* ఇక వైరస్‌ తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికా ఇంకా సంకట పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉంది. అక్కడ మృతుల సంఖ్య ప్రస్తుతం  10,910కి చేరింది. ఇప్పటి వరకు 3,67,461 మంది వైరస్‌ బారినపడ్డట్లు గుర్తించారు. రోజురోజుకీ వైరస్‌ వ్యాప్తి పెరుగుతుండడంతో ఆ దేశ పరిశోధన సంస్థలు టీకా, ఔషధాల పరిశోధనల్ని వేగవంతం చేశాయి. తాజాగా చేపట్టిన చర్యలతో మహమ్మారిని కట్టడి చేయగలుగుతున్నామని శ్వేతసౌధంలోని టాస్క్‌ఫోర్స్‌ తెలిపింది. గతంతో లక్ష నుంచి రెండు లక్షల వరకూ మరణించే అవకాశం ఉందని ప్రకటించిన అధికారులు దాన్ని సవరించారు. ఇప్పుడు అది లక్ష దిగువనే ఉంటుందని అంచనా వేశారు.

* ఇటలీలో కరోనా వైరస్‌ సోమవారం మరో 636 మందిని బలితీసుకుంది. ఆదివారంతో పోలిస్తే ఈ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో అక్కడ మృతుల సంఖ్య 16,523కు పెరిగింది. కొత్తగా మరో 2500 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించడంతో బాధితుల సంఖ్య 1,32,547కు చేరింది. అయితే ఐసీయూలకు రోగుల తాకిడి మాత్రం తగ్గుతోందని అధికారులు తెలిపారు. 

* జపాన్‌లోనూ వైరస్‌ ఉద్ధృతి పెరుగుతుండడంతో అక్కడి ప్రభుత్వం సోమవారం ఆత్యయిక స్థితిని ప్రకటించింది. కరోనా వల్ల ప్రభావితమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆ దేశంలో ఇప్పటి వరకూ 3,654 మంది వైరస్‌ బారినపడగా.. వీరిలో 73 మంది మరణించారు. 

* స్పెయిన్‌లో 24 గంటల్లో 634 మరణాలు సంభవించినట్లు అక్కడి ప్రభుత్వం సోమవారం వెల్లడించింది. గత రెండు వారాల్లో ఇదే అత్యల్పం కావడం అక్కడి ప్రజలకు ఊరట కలిగిస్తోంది. అత్యధికంగా గత గురువారం 950 మంది మరణించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు స్పెయిన్‌లో 13,341 మంది వైరస్‌ ధాటికి కన్నుమూశారు. మొత్తం 1,36,675 మందికి ఈ మహమ్మారి సోకినట్లు గుర్తించారు. 

ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ సోకినవారి సంఖ్య : 13,47,803
కోలుకున్నవారి సంఖ్య : 2,77,402 
మృతుల సంఖ్య : 74,807

(మంగళవారం ఉదయం 12:10 గంటల సమయానికి)

 

ఇవీ చదవండి...

కష్టకాలంలో పెద్దమనసు చాటుకున్న భారత్‌!

భారత్‌లో కరోనా: 114 మరణాలు, 4421 కేసులు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.