close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/04/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

బోధనలో ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు

ఎన్‌సీఈఆర్‌టీ ప్రకటన విడుదల

బోధనా కోర్సులపై ఆసక్తి ఉన్న వారికి నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) ఆహ్వానం పలుకుతోంది. రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఆర్‌ఐఈ సీఈఈ) ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో 2020 విద్యాసంవత్సరానికి ప్రవేశాలను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా డిగ్రీతోపాటు పీజీ కోర్సుల్లోనూ చేరవచ్చు.

కేంద్ర మానవవనరుల శాఖ పరిధిలోని అటానమస్‌ సంస్థ అయిన ఎన్‌సీఈఆర్‌టీ వివిధ టీచింగ్‌ కోర్సుల్లో చేరటానికి ఉమ్మడి ప్రవేశపరీక్షను నిర్వహిస్తోంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌సీఈఆర్‌టీ 8 సంస్థలు- ఆర్‌ఐఈ- అజ్‌మేర్‌, ఆర్‌ఐఈ- భువనేశ్వర్‌, ఆర్‌ఐఈ- భోపాల్‌, ఆర్‌ఐఈ- మైసూరు, ఎన్‌ఈఆర్‌ఐఈ- షిల్లాంగ్‌, ఎన్‌ఐఈ; సీఐటీఈ- న్యూదిల్లీ, పీఎస్‌ఎస్‌సీఐవీఈ, భోపాల్‌ల్లో ప్రవేశాలను కల్పిస్తుంది. కోర్సునుబట్టి సీట్ల సంఖ్యలో మార్పులున్నాయి. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఆర్‌ఐఈ- మైసూరులో అందుబాటులో ఉన్న కోర్సులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అర్హతలు

మొత్తంగా అయిదు రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

బీఈడీ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌): కోర్సు కాలవ్యవధి రెండేళ్లు. దీనిలో సైన్స్‌ అండ్‌ మేథమేటిక్స్‌; సోషల్‌ సైన్స్‌ అండ్‌ లాంగ్వేజ్‌ విభాగాలున్నాయి. బ్యాచిలర్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ ఇన్‌ సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో బ్యాచిలర్స్‌/ సోషల్‌ సైన్స్‌, హ్యుమానిటీస్‌, కామర్స్‌ల్లో డిగ్రీ/ పీజీ చేసినవారు అర్హులు. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి.

బీఏ బీఈడీ: కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. సైన్స్‌/ కామర్స్‌ విభాగాల్లో ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్యను కనీసం 50% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. ఈ ఏడాది పరీక్షలు రాసినవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఎస్‌సీ బీఈడీ: ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. కాలవ్యవధి నాలుగేళ్లు.

ఫిజికల్‌ సైన్స్‌లో అడ్మిషన్‌ కోరుకునేవారు ఎంపీసీ, బయలాజికల్‌ సైన్స్‌లో ప్రవేశం పొందాలనుకునేవారు బైపీసీనీ ఇంటర్‌ స్థాయిలో పూర్తిచేసి ఉండాలి. 50% మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. 2018, 2019, 2020 సంవత్సరాల్లో పాసైనవారే దరఖాస్తుకు అర్హులు.

ఎంఈడీ: కాలవ్యవధి రెండేళ్లు

బీఈడీ, బీఏ బీఈడీ, బీఏఎడ్‌, బీఎస్‌సీ బీఈడీ, బీఎస్‌సీ ఎడ్‌, బీఈఐ ఎడ్‌, డీఈఐ ఎడ్‌ (డిగ్రీస్థాయిలో ఆర్ట్స్‌/ సైన్స్‌)ల్లో ఏదో ఒకదానిని 50%లతో పూర్తిచేసినవారు అర్హులు.

ఎంఎస్‌సీ ఎడ్‌: ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌. కాలవ్యవధి ఆరేళ్లు. ఇది ఆర్‌ఐఈ మైసూరులో మాత్రమే అందుబాటులో ఉంది. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌లకు ఒక్కోదానిలో 15 చొప్పున సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్యను ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మేథమేటిక్స్‌ సబ్జెక్టులతో పూర్తిచేసినవారు అర్హులు. 50% మార్కులు వచ్చి ఉండాలి.

కోర్సు ఏదైనా ఎస్‌సీ/ఎస్‌టీ/పీడబ్ల్యూడీ వారికి 5% మార్కుల సడలింపు లభిస్తుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ (https://cee.ncert.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు జనరల్‌/ ఓబీసీ వారికి రూ.1000, ఎస్‌సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: మే 04, 2020. ప్రవేశపరీక్ష తేదీ: మే 24, 2020.

పూర్తిసిలబస్‌, గత ప్రశ్నపత్రాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

పరీక్ష విధానం

ఇది ఆఫ్‌లైన్‌ పరీక్ష. విద్యార్థి పూర్తిచేసిన గత విద్యాస్థాయి నుంచే ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్షను మొత్తం 80 మార్కులకు నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ ఇన్‌ ఇంగ్లిష్‌ నుంచి 20, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌/ ఆటిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీల నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు. రుణాత్మక మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు కోత విధిస్తారు. కేటాయించిన పరీక్ష కేంద్రాల్లో విద్యార్థి తనకు నచ్చిన ఏవైనా మూడింటిని ఎంచుకునే వీలుంది. తెలుగు రాష్ట్రాల వారికి విజయవాడ, హైదరాబాద్‌ల్లో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.