close

తాజా వార్తలు

Published : 08/04/2020 10:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనాతో 14 నెలల శిశువు మృతి

జామ్‌నగర్‌(గుజరాత్‌) : కరోనావైరస్‌తో వృద్ధులే కాకుండా చిన్నారులు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌-19 బారిన పడి 14 నెలల శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు.  ఇటీవల ఆసుపత్రిలో చేరిన శిశువుకు ఏప్రిల్‌ 5న  కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా..వెంటిలేటర్‌పై ఉంచి  చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం శిశువు మృతి చెందింది.  అయితే శిశువు తల్లిదండ్రులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. వారికి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.