close

తాజా వార్తలు

Updated : 09/04/2020 16:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

లక్ష కోట్లతో కేంద్రం రెండో ఆర్థిక ప్యాకేజీ?

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు

బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ అంచనా

ముంబయి: కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే రూ.లక్ష కోట్లకు పైగా విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించనుందని సమాచారం. సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలకు వడ్డీ రాయితీలు, స్థిరాస్తి రంగానికి మినహాయింపులు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పునర్‌ మూలధన సమీకరణకు ప్యాకేజీలో ప్రాధాన్యం ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తెలిపింది.

ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 మహమ్మారి ప్రభావం తగ్గించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.1.75 లక్షల కోట్ల విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యక్తులు, బడుగు, బలహీన వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీ ఉంది. బడ్జెట్‌లో ప్రకటించిన మొత్తమూ పథకంలో ఉందని ఎస్‌బీఐ ఆర్థిక వేత్తలు అన్నారు. కొత్తగా ఇచ్చింది రూ.70వేల కోట్లేనని పేర్కొన్నారు.

‘అంతకు ముందు 0.35% మీద జీడీపీలో 0.3% విలువైన మరో ఆర్థిక ఉద్దీపన పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుందని మేం అంచనా వేస్తున్నాం’ అని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తెలిపింది. ఆర్థిక లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనపై నరేంద్రమోదీ సర్కారు దృష్టిపెట్టిందని వెల్లడించింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఉద్దీపన, పడిపోతున్న వృద్ధిరేటుపై అధిక ఆర్థిక లోటు నడుమ ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు.

చిన్న పరిశ్రమలు చెల్లించాల్సిన రుణాలపై ఏడాది వరకు 2% రాయితీ ఇస్తే జీడీపీలో 0.1 శాతం ఖర్చవుతుందని బ్యాంక్‌ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్‌ తెలిపింది. గృహ రుణాలపై రాయితీలు డిమాండ్‌కు ఊతమిస్తాయని వెల్లడించింది. జీడీపీలో 0.75 శాతానికి సమానంగా బ్యాంకుల్లో మూలధన సమీకరణ చేస్తే మొండి బకాయిల స్థాయి తగ్గుతుందని పేర్కొంది.

రెండు ఉద్దీపనలకు తోడు కేంద్రానికి ఆదాయం తగ్గితే 2021 ఆర్థిక ఏడాదికి ఆర్థికలోటు జీడీపీలో 4.8 శాతానికి చేరుతుందని ఆ సంస్థ అంచనా వేసింది. బడ్జెట్‌ లక్ష్యాల కన్నా ఇది 1.30 శాతం ఎక్కువని తెలిపింది. వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ.. జూన్‌, అక్టోబర్లో  వడ్డీరేట్లలో 0.25% కోత విధిస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపింది. జూన్‌ త్రైమాసికానికి జీడీపీ 2.5 శాతానికి తగ్గుతుందని తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.