close

తాజా వార్తలు

Published : 09/04/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. అర్చకులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌!

కరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించిన దృష్ట్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులకు ఏపీ సర్కార్‌ శుభవార్త చెప్పింది. చిన్న దేవాలయాల్లో పనిచేసే అర్చకుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ‘అర్చక వెల్ఫేర్‌ ఫండ్‌’ ద్వారా ఒక్కొక్కరికి రూ.5వేలు చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించినట్టు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీఎస్‌ ఆర్టీసీలో రిజర్వేషన్లు నిలిపివేత

బస్సు రిజర్వేషన్లను నిలిపివేస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ వెల్లడించింది. కరోనా వ్యాప్తి, నియంత్రణ నేపథ్యంలో ప్రస్తుతం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశలుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ పేర్కొంది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కి ఇవ్వనున్నట్లు తెలిపింది. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చాకే రిజర్వేషన్లు తిరిగి ప్రారంభిస్తామని ఆర్టీసీ తెలిపింది.

3. లాక్‌డౌన్‌ పొడిగించాలి: తెదేపా పొలిట్‌బ్యూరో

కరోనా మహమ్మారి విజృంభణతో దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్‌ను ఈ నెలాఖరు వరకు పొడిగించాలని కేంద్రానికి తెదేపా పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి చేసింది. తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానం చేశారు. లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలు, పేదలకు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాలను కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. తెలంగాణలో 12కి చేరిన కరోనా మృతులు

తెలంగాణలో కరోనా మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. నిన్న 49 పాజిటివ్‌ కేసులు రాగా.. ఈ రోజు కేవలం 18 కేసులు నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు వచ్చిన కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 471కి చేరిందన్నారు. వీరిలో 45 మంది డిశ్చార్జి కాగా.. 12 మంది మృతి చెందినట్టు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ఏపీలో అత్యవసర సేవలకు ‘ఓలా’

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆపత్కాలంలో ప్రజా రవాణాకు ఓలా క్యాబ్‌లకు అనుమతిస్తున్నట్టు ఏపీ సర్కార్‌ తెలిపింది. అత్యవసర వైద్య సేవలకు వీటిని అనుమతించాలని నిర్ణయించింది. అత్యవసర వైద్య, రవాణా సేవలకు ఓలా సంస్థ ముందుకొచ్చిందని రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. ఓలా సేవలపై రవాణా, పోలీసు శాఖలు చర్చించి నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కరోనాపై పోరుకు ‘షీల్డ్‌’: కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలో కరోనా వైరస్‌పై పోరుకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ సమగ్ర ప్రణాళికతో ముందుకొచ్చారు. దీనికి ‘షీల్డ్‌’ (SHIELD) అని పేరుపెట్టారు. దిల్లీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న 21 ప్రాంతాల్లో ‘షీల్డ్‌’ చేపట్టనున్నామని అరవింద్‌ కేజ్రీవాల్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ సమగ్ర ప్రణాళిక గురించి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అప్పుడు 108సార్లు చాలీసా చదివేవాడిని: పవన్‌

తాను టీనేజ్‌లో ఉండగా హనుమాన్‌ చాలీసా 108 సార్లు చదివేవాడినని అంటున్నారు అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. ఏప్రిల్‌ 8వ తేదీ తనకెంతో ప్రత్యేకమంటూ చిరంజీవి చేసిన ట్వీట్‌పై పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. హనుమంతుడిని ఆరాధించడం తమ సోదరుడు చిరంజీవిగారితో మా ఇంట్లో అలవాటైందన్నారు. అదే మా తండ్రిని నాస్తికవాదం నుంచి రామ భక్తుడిగా మార్చిందని ట్వీట్‌లో చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. కంగారు వద్దు: ‘జన్‌ ధన్‌’ డబ్బులు వెనక్కిపోవు

ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన ఖాతాల్లో జమ చేసిన డబ్బులను ప్రభుత్వం వెనక్కి తీసుకోదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. వదంతులను ప్రజలు నమ్మొద్దని సూచించింది. ఏప్రిల్‌ నెలకు సంబంధించి రూ.500ను ఇప్పటికే జమచేశామని వెల్లడించింది. మిగిలిన వెయ్యి రూపాయలను రూ.500 చొప్పున తర్వాతి రెండు నెలల్లో జమచేస్తామని స్పష్టం చేసింది. జమ చేసిన డబ్బులు విత్‌డ్రా చేయకుంటే ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందన్న వదంతులు రావడంతో వ్యక్తిగత దూరం పాటించకుండా బ్యాంకుల వద్ద జనం విపరీతంగా గుమిగూడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. 70శాతం పడిపోయిన చమురు డిమాండ్‌|

దేశవ్యాప్తంగా కొనసాగుతోన్న లాక్‌డౌన్‌తో వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. 130కోట్ల పైచిలుకు జనాభా ఉన్న దేశంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావడంతో రోడ్లన్నీ ఖాళీగా మారాయి. విమాన, రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ మూగబోయింది. దీంతో భారీగా చమురు వినియోగించే దేశంలో ఒక్కసారిగా వీటి డిమాండ్‌ పతనమయ్యింది. దీంతో చమురుశుద్ధి సంస్థలతోపాటు ఉత్పత్తి సంస్థలపై కూడా దీని ప్రభావం భారీగా పడింది. లాక్‌డౌన్‌ కాలంలో దాదాపు 70శాతం డిమాండ్‌ కోల్పోయినట్లు చమురుసంస్థలు అంచనా వేస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సరైన సమయంలో ఆదుకున్నారు..మోదీజీ..

తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో  భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలను సరైన సమయంలో ఆదుకున్నారని వెల్లడించారు. మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ సరఫరాకు భారత్ అంగీకరించడమే అందుకు కారణం. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కొవిడ్ 19 చికిత్సలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించడంతో ఒక్కసారిగా ఆ మందులకు డిమాండ్‌ పెరిగిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.