close

తాజా వార్తలు

Updated : 15/04/2020 10:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా: ‘దెయ్యాల’తో నియంత్రణ

చైనా, యూకేని దాటేసిన న్యూయార్క్‌

మహమ్మారి కరోనాపై పోరుకు ప్రపంచమంతా ఏకమైంది. ప్రాణాంతాక వైరస్‌పై విజయం సాధించాలని పోరాడుతోంది. అయినా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తూ ఎంతో మందిని బలి తీసుకుంటోంది. అగ్రరాజ్యం అమెరికా విలవిలలాడుతోంది. దేశాలన్నీ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయి. అయితే కరోనాపై కేరళ ప్రజలు విజయం సాధిస్తుండటం.. ఆన్‌లైన్ విక్రయాల‌ సంస్థలు‌ వేల సంఖ్యలో ఉద్యోగాల నియమాకానికి చర్యలు చేపట్టడం కాస్త ఊరటనిచ్చే అంశాలు. మరోవైపు కరోనా కట్టడికి దిల్లీలో, ఇండోనేషియాలోని ఓ గ్రామాల్లో అమలు చేస్తున్న విధానాలు భేష్‌. ఆ విశేషాలు చూద్దాం.


చైనా, యూకేని దాటేసిన న్యూయార్క్‌

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మృత్యు మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే 22 వేలమందికి పైగా మరణించారు. ఇక కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఒక్క న్యూయార్క్ నగరంలోనే కేసుల సంఖ్య దాదాపు రెండు లక్షలకు చేరింది. చైనా, యూకేలో నమోదైన కేసులు కంటే మించిపోవడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. యూకేలో 88,621, చైనాలో 82,249 మందికి కరోనా సోకగా న్యూయార్క్‌లో మహమ్మారి బాధితుల సంఖ్య 1.95 లక్షలు.


‘దెయ్యాల’తో నియంత్రణ

ఇండోనేషియాలోని కెపుహ్‌ గ్రామంలో వాలంటీర్లు వినూత్నంగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్నారు. దెయ్యాల వేషాలు వేసుకుని రాత్రి వేళల్లో తిరుగుతున్నారు. ఆ వాలంటీర్లను చూసి బయట తిరగాలని భావించిన ప్రజలు భయపడి ఇళ్లలోనే ఉంటున్నారు. ఇలా భిన్నంగా కరోనా వ్యాప్తిని అడ్డుకుంటున్న వాలంటీర్లు ప్రశంసలు పొందుతున్నారు. 


అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుందని, లక్షల మంది ఉపాధిని కోల్పోతారని భావిస్తున్నారు. అయితే ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరో 75వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతుంది. ఇటీవల ప్రకటించినట్లుగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేశామని, ఇవి అదనంగా నియమిస్తున్నామని తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ విక్రయాలు భారీగా పెరగడంతో వేర్‌హౌస్‌ సిబ్బంది నుంచి డెలివరీ డ్రైవర్ల వరకు నియమాకాన్ని చేపడుతున్నామని సోమవారం వెల్లడించింది. అంతేకాక అమెరికాలో కొత్త ఉద్యోగులకు గంటకు కనీసం 15 డాలర్ల చొప్పున వేతనాన్ని ఇస్తామని ప్రకటించింది.


దిల్లీ మార్కెట్లలో సరి-బేసి విధానం

హోల్‌సేల్‌ మార్కెట్‌లో ఇక నుంచి సరి-బేసి విధానాన్ని అనుసరించాలని దిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వ్యాపారులు ప్రత్యామ్నాయ రోజుల్లో మాత్రమే కూరగాయలు/పండ్లు విక్రయించాల్సి ఉంది. కూరగాయలను ఉదయం 6-11 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకు పండ్లను అమ్మాలని మంత్రి గోపాల్‌ రాయల్‌ తెలిపారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు.


మహమ్మారిపై కేరళ పైచేయి

దేశమంతా కరోనా వేగంగా విస్తరిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది. మహమ్మారి ధాటికి బాధితులు మృత్యువాత పడుతున్నారు. అయితే కేరళలో మాత్రం ఎక్కువ సంఖ్యలో కరోనాను జయించి డిశ్చార్జి అవుతున్నారు. 379 మందికి కరోనా సోకగా ఏకంగా 198 మంది డిశ్చార్జి అయ్యారు. ముగ్గురు మరణించారు. దీంతో అక్కడ యాక్టివ్ కేసులు 178కి తగ్గింది.


ఇలాంటి సమయంలో వివక్షనా?
ప్రస్తుత క్లిష్టసమయంలో వైద్యులు, కరోనా బాధితులపై కొంతమంది వివక్షను చూపించడం బాలీవుడ్ నటి అనుష్క శర్మ తీవ్రంగా ఖండించారు. కరోనాపై చేస్తున్న పోరులో ముందుండి సేవ చేస్తున్న వైద్యులు, మహమ్మారి బాధితులుపై వివక్ష చూపిస్తున్నారని అనే వార్త తెలిసిన తర్వాత ఎంతో బాధపడ్డానని తెలిపారు. ఇలాంటి సమయంలో ఇతరులతో సున్నితంగా ఉండాలని సూచించారు. ఎవరినీ అగౌరవపరచకుండా అందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.