close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 15/04/2020 00:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చేతులు సరే..  గ్యాడ్జెట్‌ల మాటేంటి?

శుభ్రత.. పరిశుభ్రత

కరోనా భారిన పడకుండా చేతులు పదే పదే శుభ్రం చేస్తున్నాం సరే.. కానీ, నిత్యం వెంటే ఉండే గ్యాడ్జెట్‌ల సంగతేంటి? క్లీన్‌చేస్తున్నారా? ఎలా చేస్తున్నారు? అలాగే, వాటి వాడకంలో తగిన జాగ్రత్తలు ఎలా తీసుకుంటున్నారు? అందుకు వీటిని ఫాలో అయిపోండి.. ప్రత్యేక కిట్‌లు.. చిట్కాలు..

స్విచ్‌ఆఫ్‌ చేశాకే ఏదైనా..

అందుబాటులో ఉన్న ద్రావణాలతో శుభ్రం చేయడానికి ఇప్పటికే ప్రయత్నించి ఉంటారు. అయితే, ఏ ద్రావణాన్ని అయినా సరాసరి గ్యాడ్జెట్‌లపై స్ప్రే చేయడం మంచిది కాదు. సుతిమెత్తని క్లాత్‌పై సబ్సు నీళ్లు, మరేదైనా క్లీనింగ్‌ ద్రావణాన్ని చల్లి.. ఆ గుడ్డతోనే క్లీన్‌ చేయాలి. తెరలపై ఎక్కువ ఒత్తిడి పెట్టి రుద్దడం లాంటివి చేయొద్ధు తాకేతెర పాడయ్యే అవకాశాలు ఉంటాయి. మార్కెట్‌లో తెరల్ని శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా ‘వైప్స్‌’ (Chicco Wipes) అందుబాటులో ఉన్నాయి. వాటితో మృదువుగా తెరపై తుడిస్తే చాలు. శామ్‌సంగ్‌ ఇప్పటికే ‘ఫ్రీ ఫోన్‌ శానిటైజింగ్‌ సర్వీసు’ని కొన్ని దేశాల్లో అందిస్తోంది. వేటితోనైనా.. ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీ.. దేన్ని శుభ్రం చేయడానికి ముందు తప్పనిసరిగా అన్ని కేబుల్స్‌ని తొలగించి, స్విచ్‌ఆఫ్‌ చేశాకే శుభ్రం చేయండి.

అన్నింటికీ వాడొచ్చు

ఫోన్‌ స్క్రీన్‌ క్లీనర్‌ కోసం వెతుకుతుంటే NSinc 3 in 1 Screen Cleaning Set ని ప్రయత్నించండి. తక్కువ ధరలో ఎక్కువ వస్తువులతో లభిస్తుంది. ఈ కిట్‌లో స్క్రీన్‌ క్లీనర్‌ జెల్‌తో పాటు నునుపు రీయూజెబుల్‌ మైక్రోఫైబర్‌ క్లాత్‌, బ్రష్‌ అందుబాటులో ఉంచారు. కేవలం ఫోన్‌ క్లీనింగ్‌కే కాకుండా ట్యాబ్లెట్‌, టీవీ, ల్యాప్‌టాప్‌, డెస్క్‌టాప్‌లను శుభ్రపరచొచ్చు.

పిల్లలతో జాగ్రత్త..

క్క కొడుకో.. అన్న కూతురో ఎవరో ఒకరు ఇంట్లో తిరుగుతూనే ఉంటారు. మరో వైపు పేరెంట్స్‌.. నిజానికి ఇంటిల్లిపాదీ కలిసి ఒకరికోసం మరొకరు అనుకుని ఆనందంగా గడిపే సమయంలో వర్క్‌ ఫ్రం హోంతో ఇంట్లో కొన్ని గంటలైనా పని చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు కచ్చితంగా గ్యాడ్జెట్‌ల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. స్ట్రీమ్‌టైమ్‌ని సెట్‌ చేసి పెట్టుకోకపోయినా.. రోజుకి కొన్ని గంటల సమయమే కంప్యూటర్‌లు, ల్యాపీలకు పరిమితం అవ్వడం. మితంగా సమయాన్ని కుటుంబంతో గడిపేందుకే ప్రాధాన్యం ఇవ్వండి. అలాగే, పిల్లలకు ఫోన్‌లను అందకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే.. ఏదో ఒక అత్యవసర పని నిమిత్తం బయటికి వెళ్లాల్సి వస్తే కచ్చితంగా ఫోన్‌ని వెంటే తీసుకుని వెళ్తారు. ఇంటికి రాగానే మీరు శుభ్రంగా స్నానం చేస్తారు సరే.. మీ ఫోన్‌పై చేరిన బ్యాక్టీరియా సంగతేంటి? దానిపై కరోనా వైరస్‌ లేదని గ్యారెంటీ ఏంటి? అందుకే.. ఫోన్‌లను పిల్లలకు దూరంగా ఉంచడం శ్రేయస్కరం. అంతేకాదు.. బయటికి వెళ్లొస్తే.. అందుబాటులో ఉన్న ‘వెట్‌ వైప్‌’లతో ఫోన్‌ని శుభ్రం చేయడం మర్చిపోవద్దు.

ఒకవేళ ఇప్పటికీ మీరు రిమూవబుల్‌ బ్యాటరీతో కూడిన ఫోన్‌లను వాడుతున్నట్లయితే బ్యాటరీని తొలగించాకే వెట్‌ వైప్స్‌తో శుభ్రం చేయాలి.

కేబుళ్లతో కూడిన గ్యాడ్జెట్‌లను క్లీన్‌ చేద్దాం అనుకుంటే మొదట అన్ని కేబుళ్లను పవర్‌ సాకెట్‌ల నుంచి డిస్‌కనెక్ట్‌ చేయాలి.

ఇంట్లో, ఆఫీస్‌ అవసరాలకు వాడే సాధారణ వెట్‌ వైప్‌లతో మాత్రమే గ్యాడ్జెట్‌లను తుడవాలి. ఆసుపత్రుల్లో వైద్య అవసరాలకు వాడే వైప్‌లను మాత్రం వాడొద్ధు వాటిల్లోని రసాయనాలు గ్యాడ్జెట్‌లపై ప్రభావం చూపించొచ్ఛు

వైప్‌లతో తుడిచే ముందు వాటిని కాస్త పిండండి. దీంతో అదనంగా వైప్‌లలో ఉన్న నీరు బయటికి వచ్చేస్తుంది. తడి వైప్‌తో తుడిచిన తర్వాత వెంటనే శుభ్రమైన పొడి బట్టతో తుడిస్తే మంచిది.

కీబోర్డుల్లోనే ఎక్కువగా వైరస్‌ దాగుంటుంది. రోజులో కొన్ని నిర్ణీత గంటల మధ్య తుడవడం మర్చిపోవద్ధు ఏ రకమైన ద్రావణాన్ని సరాసరి కీబోర్డుపై స్ప్రే చేయొద్ధు మెత్తని బట్టపై కాస్త క్లీనింగ్‌ ద్రావణాన్ని వేసి దాన్ని పిండాకే కీబోర్డుని తుడవాలి. కీబోర్డుపై పూర్తిగా తడారిన తర్వాతే కనెక్టు చేసి వాడాలి.

ఫోన్‌, ట్యాబ్‌, ల్యాపీ.. ఏదైనా వాటి తెరల్ని శుభ్రం చేసేటప్పుడు ద్రావణాన్ని సరాసరి తెరలపై వేసి తుడవడం శ్రేయస్కరం కాదు.

క్లీనింగ్‌ కిట్‌

ఫోన్‌లో చిప్‌, ఛార్జింగ్‌ వైర్‌ను ఇన్‌సెర్ట్‌ చేసే లోపలివైపు శుభ్రపరచడానికి ఇయిర్‌బడ్స్‌ను పోలి ఉండే మినీ ఫోం టిప్డ్‌ క్లీనింగ్‌ స్వాబ్స్‌, స్టిక్స్‌ ఈ కిట్‌లో ఉంటాయి. వీటితోపాటు ఫోన్‌ స్క్రీన్‌ను క్లీన్‌ చేయడానికి డస్ట్‌ క్లీనింగ్‌ క్లాత్‌ కూడా ఉంటుంది. ●


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.