close

తాజా వార్తలు

Updated : 15/04/2020 13:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

స్వీయ నిర్బంధంలోకి గుజరాత్‌ సీఎం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్‌రూపానీ సైతం స్వీయ నిర్బంధంలోకి వెళ్లారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశానికి హాజరైన ఓ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ముఖ్యమంత్రి స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ సమావేశానికి మంత్రులు కూడా హాజరు కావడంతో గుజరాత్‌ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

గుజరాత్‌లో ఇప్పటివరకూ 650 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 59 మంది కోలుకొని డిశ్ఛార్జి కాగా.. 28 మంది మృతి చెందారు. మరోవైపు కరోనా కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.