close

తాజా వార్తలు

Updated : 15/04/2020 15:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రోజూ మీ ముఖం చూపించండమ్మా..!

ఈ అమ్మ మనసే గోదారి... నటుడు మాధవన్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మే 3వరకు పొడిగించారు. ఈ నేపథ్యంలో పోలీసులు, వైద్య సిబ్బంది నిరంతర సవాళ్లతో కూడిన వాతావరణంలో విధులను నిర్వహిస్తున్నారు. ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా వెనుకడుగు వేయని వీరిపై మానవత్వం మరచిన కొందరు దాడులకు తెగబడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పోలీసులకే ధైర్యాన్నిచ్చే సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ప్రముఖ నటుడు మాధవన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. 

ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌, తూర్పుగోదావరి జిల్లా, తుని పట్టణానికి చెందిన మహిళ ఒకరు... మండుటెండలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు రెండు పెద్ద బాటిల్స్‌తో శీతల పానీయాలను తెచ్చి అందిస్తారు. ప్రజలందరూ తమ తమ ఇళ్లలో ఉంటే చాలు, తమకు ఇంకేమీ వద్దమ్మా అంటూ మొహమాటపడిన పోలీసులను... తీసుకోవాల్సిందిగా ఆ మహిళ మరీ మరీ కోరుతారు. ఆ తరువాత తన వివరాలు అడిగిన పోలీసులకు తనో కూలీనని, తన ఆదాయం నెలకు మూడువేలని చెపుతారు. మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకుంటున్న పోలీసుల గురించి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో తాను ఇలాచేసానని ఆమె వివరిస్తారు. దీనితో కదిలిపోయిన పోలీసులు ‘‘అమ్మా, మీకు వీలైతే మీ ముఖం రోజూ ఒకసారి మాకు చూపిస్తే మాకు ధైర్యంగా ఉంటుంది.’’ అని చెప్పటం చూసినవారి మనసులను కదిలిస్తోంది. మరి నేటి పరిస్థితులకు దర్పణం పట్టే ఈ వీడియోను మీరూ చూడండి.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన