close

తాజా వార్తలు

Published : 16/04/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 PM

1. దేశంలో 24 గంటల్లో 28 మరణాలు

దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో (ఏప్రిల్‌ 16 సాయంత్ర 5 గంటల వరకు) కొత్తగా 826 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 12,759కి చేరింది. గత 24 గంటల్లో 28 మంది మరణించగా.. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 420కి చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. 20న గచ్చిబౌలి ఆస్పత్రి ప్రారంభిస్తాం:ఈటల

తెలంగాణలో మరో 50 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 700కి చేరిందన్నారు. కరోనా వ్యాప్తి నేసథ్యంలో అదనపు పడకల కోసం ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురావాలనుకున్న గచ్చిబౌలి ఆస్పత్రిని ఈ నెల 20వ తేదీన ప్రారంభించనున్నట్లు చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఏపీలో 154కంటైన్‌మెంట్‌ క్లస్టర్లు:జవహర్‌రెడ్డి

ఏపీలో వారం రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షలను 15వేల నుంచి 17వేలకు పెంచాలని ప్రయత్నిస్తున్నామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 154 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ క్లస్టర్లుగా గుర్తించామన్నారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. WHOకు నిధులు ఎలా వస్తాయ్‌?

కరోనా వైరస్‌ విషయంలో చైనాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) వత్తాసు పలుకుతోందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆ సంస్థకు నిధులు పూర్తిగా నిలిపివేశారు. డబ్ల్యూహెచ్‌వోకు ఏటా తాము దాదాపు రూ.3,833 కోట్ల వరకు నిధులు సమకూరుస్తుంటే.. చైనా కేవలం రూ.300 కోట్లు మాత్రమే ఇస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇంతకీ డబ్ల్యూహెచ్‌వోకు ఎలా వస్తాయ్‌? ఏయే దేశాల భాగస్వామ్యం ఎంత? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. చిన్న, మధ్యతరహా సాఫ్ట్‌వేర్ సంస్థలకు కేంద్రం ఊరట

కరోనా వైరస్‌ నేపథ్యంలో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న చిన్న, మధ్యతరహా సాఫ్ట్‌వేర్‌, అంకుర సంస్థలకు కేంద్రం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంస్థ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ (ఎస్టీపీఐ) భవనాల్లో అద్దెలను రద్దు చేసింది. మార్చి నుంచి జూన్‌ వరకు నాలుగు నెలల పాటు అద్దె చెల్లించనవసరం లేదని కేంద్ర సమాచార శాఖ అధికారిక ప్రకటన జారీ చేసింది. స్టీపీఐకి దేశవ్యాప్తంగా 60 ప్రాంతాల్లో భవనాలు ఉండగా.. వాటిలో 200 ఐటీ, ఐటీఈఎస్‌, ఎంఎస్‌ఎంఈ సంస్థలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. 

6. నిర్మల-మోదీ సమీక్ష: రెండో ప్యాకేజీకి అవకాశం!

భారత ఆర్థిక వ్యవస్థపై కొవిడ్‌-19 ప్రభావాన్ని ప్రధాని నరేంద్రమోదీ సమీక్షించారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నుంచి విమానయాన రంగం వరకు, నిరుద్యోగం గురించి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన చర్చించారని తెలిసింది. కరోనా మహమ్మారి కారణంగా దెబ్బతిన్న రంగాల కోసం రెండో ఉద్దీపన పథకం ప్రకటించే అవకాశముందని సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. 15రోజుల్లో 3.31లక్షల పీఎఫ్‌క్లెయిమ్స్‌ పరిష్కారం

పదిహేను రోజుల్లో 3.31 లక్షల పీఎఫ్‌ క్లెయిమ్స్‌ను పరిష్కరించామని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా దరఖాస్తు చేసుకున్న చందాదారులకు రూ.950 కోట్లు విడుదల చేశామని వెల్లడించింది. లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఇబ్బందులు గురవ్వకుండా ఉండేందుకు పీఎఫ్‌ నగదును ప్రత్యేకంగా ఉపసంహరించుకొనేందుకు కేంద్రం ప్రభుత్వం 2020, మార్చి 28న నోటిఫికేషన్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రోగి మృతితో క్వారంటైన్లోకి మొత్తం వైద్యసిబ్బంది

విదేశాలనుంచి వచ్చిన విషయం దాచి ఆసుపత్రిలో చేరిన ఒక గర్భిణి(25) బుధవారం రాత్రి మరణించడంతో వైద్యసిబ్బంది మొత్తాన్ని క్వారంటైన్‌కు పంపించారు. వివరాల్లోకి వెళితే దిల్లీలోని భగవాన్‌ మహవీర్‌ఆసుపత్రిలో సోమవారం ఒక గర్భిణి ఆనారోగ్యసమస్యలతో చేరింది. చేరేముందు ఇవ్వాల్సిన సమాచారంలో ఆమె విదేశాల నుంచి తిరిగొచ్చిన విషయాన్ని సిబ్బందికి తెలియజేయలేదు. అంతేకాకుండా జిల్లామేజిస్ట్రేటు ఆమె కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్‌లో ఉండమన్నారన్న విషయాన్ని కూడా తెలియపరచలేదు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. మతం రంగు పులమడం ఇకనైనా ఆపేస్తారా!

అంతర్జాతీయ మత స్వేచ్ఛపై ఏర్పాటైన అమెరికా కమిషన్‌ (యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌)కు భారత్‌ ఘాటుగా సమాధానం చెప్పింది. మతం ఆధారంగా విభజించి కొవిడ్‌-19 బాధితులకు చికిత్స అందించడం అవాస్తవమని స్పష్టం చేసింది. కరోనా మహమ్మారిపై పోరుకు మతం రంగు పులమొద్దని నొక్కిచెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. సైనికుల కోసం ప్రత్యేక రైళ్లు.... 

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ నిబంధనలు అమలులో ఉన్న కారణంగా అన్ని రకాల ప్రజా రవాణా సదుపాయాల్ని ఆయా శాఖలు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు, బెళగావి, సికింద్రాబాద్, గోపాల్‌పురలోని శిక్షణ కేంద్రాల్లో ఉన్న సైనికులను ఉత్తర, ఈశాన్య సరిహద్దులకు తరలించేందుకు రెండు ప్రత్యేక రైళ్లు నడపాలని రైల్వే శాఖను కోరినట్లు భారత సైన్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసినట్లు సమాచారం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.