close

తాజా వార్తలు

Published : 17/04/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్ - 9 PM

1. హెల్త్‌ బులెటిన్లలో బోగస్‌ అంకెలు: చంద్రబాబు

వైకాపా నేతల నిర్వాకం వల్లే ఏపీలో కరోనా విస్తరిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. పేదల ప్రాణాలతో ఆడుకునే హక్కు వైకాపాకు లేదన్నారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడుతూ కరోనా కేసుల విషయంలో ప్రభుత్వం వ్యవరిస్తున్న తీరును తప్పుబట్టారు. పాజిటివ్‌ కేసులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న హెల్త్‌బులెటిన్లలో బోగస్‌ అంకెలున్నాయని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. తెలంగాణలో 68 కళాశాలల మూసివేత

సరైన అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలలపై హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. అనుమతులు లేని 68 కళాశాలలను మూసివేస్తూ ఇంటర్‌ బోర్డు కార్యదర్శి జలీల్‌ నోటీసులు జారీ చేశారు. మూసివేసిన కళాశాలల్లో ప్రముఖ విద్యాసంస్థలు నారాయణకు చెందిన 26, శ్రీచైతన్యకు చెందిన 18 సహా 68 కళాశాలలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఈమెయిల్‌ ద్వారా కళాశాలల యాజమాన్యాలకు సమాచారం అందించామని జలీల్‌ తెలిపారు. 

3. హాట్‌స్పాట్లలో పరీక్షలు ఎలా చేస్తారు?: హైకోర్టు

హైదరాబాద్‌లో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవడం ఆందోళనకరమని హైకోర్టు అభిప్రాయపడింది. పెద్దసంఖ్యలో ఉన్న హాట్‌స్పాట్లలో ప్రజలకు పరీక్షలు ఎలా చేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దాఖలైన వివిధ పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది. రాష్ట్రంలో కరోనా ప్రభావం ఎలా ఉంది.. టెస్టింగ్‌ కిట్లు ఎన్ని ఉన్నాయో తెలపాలని సూచించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జీహెచ్‌ఎంసీలో 146 కంటైన్‌మెంట్‌ జోన్లు: కేటీఆర్‌

కరోనా వ్యాప్తిని నివారించేందుకు కంటైన్‌మెంట్‌ జోన్లలో నిబంధనలను పటిష్ఠంగా అమలు చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మొత్తం 260 కంటైన్‌మెంట్‌ జోన్లు ఉండగా.. జీహెచ్‌ఎంసీ పరిధిలో 146 ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం నియమించిన వాలంటీర్లు, సిబ్బందితో మాత్రమే నిత్యావసరాలను డోర్‌ డెలివరీ చేయించాలని ఆదేశించారు. వీలైతే వారికి ప్రత్యేక దుస్తులు అందజేయాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. తెలంగాణలో మరో 66 కరోనా కేసులు

 తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ ఒక్కరోజే రాష్ట్రంలో కొత్తగా మరో 66 కరోనా కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గత రెండు రోజుల్లోనే 116 కేసులు నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదైన 66 కేసుల్లో 30 కేసులు జీహెచ్‌ఎంసీ పరిధిలోనే నమోదవడం గమనార్హం.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. పారాసిటమాల్ ఎగుమతిపై నిషేధం ఎత్తివేత

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో, ప్రపంచ దేశాలకు తన వంతు సాయం అందించేందుకు భారత్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. పారాసిటమాల్ మాత్రల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. అయితే పారాసిటమాల్ తయారీలో ఉపయోగించే ముడిసరుకుల ఎగుమతులపై మాత్రం ఎప్పటిలానే నిషేధాజ్ఞలు ఉంటాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. లాక్‌డౌన్‌లో అమేథీ ప్రజలకు రాహుల్ సాయం

లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న అమేథీ ప్రజలకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆహార ధాన్యాలు, నిత్యావసరాలను పంపినట్లు కాంగ్రెస్ జిల్లా యూనిట్ తెలిపింది. 5 ట్రక్కుల బియ్యం, గోధుమలు, ఒక ట్రక్కు పప్పులు, వంట నూనెలతో పాటు ఇతర నిత్యావసరాలను పంపారని ఒక ప్రకటనలో తెలిపారు. 16,400 నిత్యావసరాల కిట్లను నియోజకవర్గంలోని 877 పంచాయితీల్లోని ప్రజలకు పంపిణీ చేసినట్లు జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. 40 వేల ఉద్యోగాలు ఫ్రెషర్లకే: టీసీఎస్‌

ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది తమ ఉద్యోగుల్లో ఏ ఒక్కరినీ తొలగించబోమని పేర్కొంది. అదే సమయంలో ఉద్యోగులకు ఈ ఏడాది ఎలాంటి వేతనాల పెంపూ ఉండబోదని స్పష్టం చేసింది. ఈ ఏడాది 40 వేల ఉద్యోగాలను కేవలం ఫ్రెషర్లకే ఇవ్వాలని నిర్ణయించామని తెలిపింది. ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ అనంతరం పెద్ద ఎత్తున ఉద్యోగాల్లో కోత ఉండబోతోందన్న వార్తల నేపథ్యంలో టీసీఎస్‌ ఈ ప్రకటన చేయడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. హెల్త్‌ అసిస్టెంట్‌గా స్వీడన్‌ రాకుమారి

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని బారిన పడి చిన్నా పెద్దా తేడా లేకుండా అనేక మంది మరణిస్తున్నారు. ఈ వైరస్‌ కట్టడికి పోరాడుతున్న స్వీడన్‌కు తన వంతు తోడ్పాటునందించేందుకు ఆ దేశ యువరాణి ప్రిన్సెస్‌ సోఫియా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు.  కొవిడ్‌-19పై పోరాడుతున్న తమ దేశ వైద్యసిబ్బందికి పలు సూచనలు ఇచ్చేందుకు ఆమె స్వీడన్‌ రాజధాని స్టాక్‌ హోమ్‌లోని ఓ ఆసుపత్రిలో హెల్త్‌కేర్‌ అసిస్టెంట్‌గా చేరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పిల్లలకు రామాయణం, మహాభారతం చెప్పాలి



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.