close

తాజా వార్తలు

Published : 23/04/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. తెలంగాణలో కొత్తగా 27 కరోనా కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. వాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 13, జోగులాంబ జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయన్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా కేసులు 970కి చేరాయి. ఇవాళ ఉదయం ఒకరు మృతిచెందగా.. మొత్తం మృతుల సంఖ్య 25కి చేరినట్లు ఈటల వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీలో 47 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో..

రాష్ట్రంలోని 893 కరోనా కేసుల్లో అత్యధికంగా నాలుగు జిల్లాల్లోనే నమోదయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. నమోదైన వాటిలో 590 కేసులు 4 జిల్లాల్లోనే ఉన్నట్లు వివరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో 573 మండలాలు గ్రీన్‌ జోన్‌లో.. 47 మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో ఉన్నాయని చెప్పారు. సరిగా పరీక్షలు నిర్వహించడం లేదనే విమర్శలు సరికాదని జవహర్‌రెడ్డి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3కరోనాపై విజయం.. మోదీపై 93% విశ్వాసం

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం భారతదేశాన్ని గట్టెక్కిస్తుందని 93.5% భారతీయులు విశ్వాసంతో ఉన్నారు. ముప్పు నుంచి దేశం సమర్థంగా బయటపడుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నారని గురువారం విడుదలైన ఓ సర్వే తెలిపింది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం మార్చి 25న మొదట 21 రోజుల లాక్‌డౌన్‌ విధించింది. ఆ తర్వాత దానిని మే 3 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ట్రంప్‌ వలసల నిషేధంతో భారత్‌పై ప్రభావమెంత?

అమెరికాలో వలసల్ని తాత్కాలికంగా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయం భారతీయులపై ఎంతమేరకు ప్రభావం చూపుతుందో కేంద్రం అధ్యయనం చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఆ దేశంలో స్థిరపడిన భారతీయులపై ఈ ప్రభావం ఉండబోదని భావిస్తున్నట్టు తెలిసింది. కరోనా వైరస్‌ ముప్పుతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా నష్టపోతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌, ఆంక్షల కారణంగా అమెరికాలో నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. దక్షిణ కొరియాలో ఎన్నికలు ఎలా నిర్వహించారు!

కరోనా వ్యాప్తి తరుణంలోనూ దక్షిణ కొరియాలో పార్లమెంట్‌ ఎన్నికల నిర్వహణకు అక్కడి ప్రభుత్వం ఎన్నికల విధానంలో చేపట్టిన మార్పులను భారత ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తోంది. ఒకవేళ భారత్‌లోనూ ఈ తరహా వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే.. ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు సదరు మార్పుల అమలు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా గురువారం వెల్లడించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. కరవుభత్యంపై కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛను దార్లకు అదనపు కరవు భత్యం చెల్లింపులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. జనవరి 1 నుంచి చెల్లించాల్సి ఉన్న అదనపు కరవు భత్యాన్ని చెల్లించబోమని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. జనవరి 1 నుంచి జులై 1 వరకు చెల్లించాల్సిన అదనపు కరవు భత్యాన్ని కూడా రద్దుచేసినట్టు ఆ శాఖ తెలిపింది. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ సందర్భంగా దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించిన నేపథ్యంలో ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. అద్దె ఇవ్వాలని వేధిస్తే చర్యలు తప్పవ్‌!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో మార్చి నుంచి 3 నెలల వరకు యజమానులు ఇంటి అద్దెలు వసూలు చేయరాదని తెలంగాణ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అద్దె వసూలు చేయనందుకు ఎలాంటి వడ్డీ కూడా అడగరాదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. అద్దెలు ఇవ్వాలని, ఖాళీ చేయాలని వేధించొద్దని సూచించింది. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘించిన వారిపై  చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. సోనియాజీ.. చిల్లర రాజకీయాలొద్దు

కాంగ్రెస్‌ నాయకురాలు సోనియా గాంధీ చిల్లర రాజకీయాలు చేయొద్దని భాజపా విమర్శించింది. తమ పార్టీ మత విభేదాలు సృష్టించడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ స్పష్టం చేశారు. స్థాయి తక్కువ రాజకీయాలు చేయొద్దని కాంగ్రెస్‌కు సూచించారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ప్రభుత్వాన్ని సోనియా గాంధీ విమర్శించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. లాక్‌డౌన్‌: ముంబయి పోలీసుల క్రియేటివిటీ!

లాక్‌డౌన్‌ వేళ ముంబయి పోలీసులు సృజనాత్మకత చూపుతున్నారు. కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు రోడ్లపైకి రాకుండా అవగాహన కల్పించేందుకు కొత్త పంథాను ఎంచుకున్నారు. నేరుగానే కాకుండా సోషల్‌మీడియాలో సైతం వినూత్న పోస్టులు పెట్టి నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు.  లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో గురువారం ఓ పోస్ట్‌ పెట్టారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. కమల్‌ కోసం కదిలిన తారాలోకం 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.