close

తాజా వార్తలు

Published : 25/04/2020 00:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏకాగ్రతతో పనిచేద్దాం!

టెక్‌టాక్‌

ఇంట్లో పని చేద్దాం అని కూర్చుంటాం.. సిస్టం ఆన్‌ చేస్తాం.. కాసేపు ఫేస్‌బుక్‌ చూద్దాం అని ఓపెన్‌ చేస్తాం.. ఫోన్‌ అందుకుని యూట్యూబ్‌ చూస్తాం.. మెయిల్‌ బాక్స్‌ చెక్‌ చేస్తాం.. ఇలా పని కంటే అదీ ఇదీ చూస్తూ సమయం వృథా చేస్తుంటాం. అందుకే.. వర్క్‌ ఫ్రం హోమ్‌ అంటే అంత సులువుకాదు. ఆఫీసులో మాదిరి ఇంట్లోనూ ఏకాగ్రతతో పని చేయాలంటే? కొన్నింటికి దూరంగా ఉండాలి. అది మీ వల్ల కాకుంటే ఓ యాప్‌ని వాడండి. అదేం చేస్తుందంటే.. మీరు చూడొద్దు, వాడొద్దు అనుకునే యాప్స్‌, వెబ్‌సైట్స్‌కి కాస్త దూరంగా ఉంచుతుంది. ఇంతకీ యాప్‌ పేరు ఏంటంటే..  Stay Focused. ఇదొక యాప్‌ బ్లాకర్‌. మీరు తరచుగా వాడే యాప్‌ లేదా వెబ్‌సైట్‌కి కాసేపు తాళమేసి పని చేసుకోవచ్చు. ఓ సమయం పెట్టుకొని ఆ సమయంలోనే యాప్స్‌ ఓపెన్‌ అయ్యేలా సెట్‌ చేసుకోవచ్చు కూడా. ఎక్స్‌టెన్షన్‌ రూపంలో బ్రౌజర్‌కి జత చేసుకుని ల్యాపీ, డెస్క్‌టాప్‌లలో వాడుకోవచ్చు. క్రోమ్‌ యూజర్లు ‘వెబ్‌ స్టోర్‌’ నుంచి ఎక్స్‌టెన్షన్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని