close

తాజా వార్తలు

Published : 26/04/2020 00:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సుందర్‌ పిచాయ్‌కి ఇంత చెల్లించారట...

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) సుందర్‌ పిచాయ్‌కి 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను 281 మిలియన్‌ డాలర్ల పారితోషికం చెల్లించినట్టు ఇంటర్నెట్‌ దిగ్గజం ఆల్ఫాబెట్‌ ప్రకటించింది. దీనితో ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం పొందుతున్న సీఈఓల జాబితాలోకి సుందర్‌ పిచాయ్‌ చేరారు. భారత్‌కు చెందిన సుందరరాజన్‌ పిచాయ్‌ డిసెంబర్‌ 3, 2019న ఆల్ఫాబెట్‌ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

కాగా, 47 సంవత్సరాల పిచాయ్‌ వేతన ప్యాకేజీలో అధిక భాగం స్టాక్‌ అవార్డుల రూపంలో చెల్లించారు. అంటే మార్కెట్‌లో ఆల్ఫాబెట్‌ షేర్ల హెచ్చుతగ్గులకు అనుగుణంగా ఆయన వార్షిక వేతనాన్ని లెక్కిస్తారు. ఇక గత సంవత్సరానికి గాను పిచాయ్‌ వేతనం 6,50,000 డాలర్లు కాగా... ప్రస్తుతం దీనిని 2 మిలియన్‌ డాలర్లకు పెంచినట్టు ఆల్ఫాబెట్‌ తెలిపింది. ఇక తమ కంపెనీ ఉద్యోగుల సరాసరి జీతాల మొత్తం కంటే, తమ సీఈఓ పారితోషికం 1085 రెట్లు ఎక్కువని అల్ఫాబెట్‌ తెలిపింది. కరోనా వైరస్‌ వ్యాప్తి  నేపథ్యంలో ఆల్ఫాబెట్‌లో ఈ సంవత్సరం ఉద్యోగాలు, పెట్టుబడి ప్రణాళికల విషయంలో గణనీయంగా కోత విధిస్తూ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ నిర్ణయం తీసుకున్నారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

Panch Pataka

దేవతార్చన