close

తాజా వార్తలు

Updated : 28/04/2020 04:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత వృద్ధిరేటు 1.9 శాతమే!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంపై ఇండ్‌ రా అంచనా

ముంబయి: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) సంక్షోభ ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి 1.9 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఇండ్‌-రా) అంచనా వేసింది. 29 ఏళ్లలోనే ఇది కనిష్ఠ వృద్ధిరేటు అవుతుందని పేర్కొంది. మే మధ్య వరకు పాక్షిక లాక్‌డౌన్‌ కొనసాగుతుందనే అంచనాతో, ఈ గణాంకాలు రూపొందించినట్లు సంస్థ తెలిపింది. ఒకవేళ మే తరవాత కూడా లాక్‌డౌన్‌ కొనసాగితే, వృద్ధిరేటు నెగెటివ్‌ 2.1 శాతంగా నమోదు కావచ్చని కూడా సంస్థ అంచనా వేసింది. ఈ ఏడాది మార్చిలో వెలువరించిన అంచనాల్లో, భారత వృద్ధిరేటు 3.6 శాతం కావచ్చని సంస్థ పేరొకనడం గమనార్హం. 1991-92లో భారత ఆర్థిక వ్యవస్థ 1.1 శాతం వృద్ధిని సాధించిందని సంస్థ గుర్తు చేసింది. సంస్థ అంచనాలు ఇలా..
* ఒకవేళ మే మధ్య కాలం తరవాతా లాక్‌డౌన్‌ కొనసాగి, 2020 జూన్‌ ఆఖరు నుంచి క్రమానుగత రికవరీ చోటుచేసుకుంటే, జీడీపీ వృద్ధి ప్రతికూలమై, - 2.1 శాతం కావచ్చని, ఇది 41 ఏళ్ల కనిష్ఠమని తెలిపింది. 1951-52 తదుపరి ఆరుసార్లు ప్రతికూల వృద్ధి నమోదైందని వివరించింది.
మార్కెట్‌ కబుర్లు
* కే క్యాపిటల్‌ ఆర్థిక మద్దతు కలిగిన మెమె షేరింగ్‌ యాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమ సంస్థ షేర్‌ఛాట్‌ వెల్లడించింది. ఇందుకు ఎంత చెల్లించిందీ తెలుపలేదు. తెలుగు సహా 15 భాషల్లో సేవలందిస్తున్న షేర్‌ఛాట్‌కు ప్రస్తుతం 6 కోట్ల మంది చందాదార్లుండగా, ఈ ఏడాది ఆఖరుకు రెట్టింపు చేసుకోవాలన్నది సంస్థ లక్ష్యం.

* కోల్‌ ఇండియాకు డంపర్లు సరఫరా చేసేందుకు రూ.398 కోట్ల ఆర్డరు లభించినట్లు ప్రభుత్వ రంగసంస్థ బెమెల్‌  తెలిపింది. 150టి ట్రక్కులు ఏడు, 205ఇ ట్రక్కులు ఎనిమిది సరఫరా చేయాలి. వీటికి అవసరమైన విడిభాగాల సరఫరాకు ఎనిమిదేళ్ల కాంట్రాక్ట్‌ పొందినట్లు వివరించింది. మైసూరులో ఈ ట్రక్కులు తయారు చేస్తున్నట్లు వెల్లడించింది.

* 317 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన 5 సౌరవిద్యుత్తు ప్లాంట్లను అంతర్జాతీయ పెట్టుబడి సంస్థ కేకేఆర్‌కు రూ.1554 కోట్లకు విక్రయించేందుకు ఒప్పందం కుదిరినట్లు షాపూర్జీ పల్లోంజీ వెల్లడించింది. మహారాష్ట్రలో 169 మెగావాట్లు, తమిళనాడులో 148 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసే ప్లాంట్లు ఇందులో ఉన్నాయి.

* నగరాల మధ్య ఉత్పత్తులను వేగంగా రవాణా చేసేందుకు 55 రైలు మార్గాలను వినియోగించుకుంటున్నట్లు అమెజాన్‌ ఇండియా తెలిపింది. గత ఏడాది 13 మార్గాల్లో సరకు రవాణా కోసం రైల్వేలతో సంస్థ ఒప్పందం చేసుకుంది. ఇప్పుడు మరింత పెంచనుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.