close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 01/05/2020 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఒకటీ... మరోటీ

ఇలా కప్పుమీద కప్పు మీరు తాగే టీ మామూలు టీ కాకుండా రోగనిరోధక శక్తిని పెంచేదైతే? అప్పుడు వీటిని  ప్రయత్నించండి.. ఈ టీలు రోగనిరోధకతను పెంచడంతోపాటు శ్వాస సంబంధ సమస్యలకు చెక్‌ పెడతాయి. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

తులసి టీ

తయారీ: ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా హానికారక సూక్ష్మజీవులతో పోరాడుతుంది. కప్పున్నర నీటిలో పావు కప్పు తులసి ఆకులు వేసి పది నిమిషాల వరకు చిన్నమంటపై బాగా మరిగించాలి. ఆ తరువాత ఆ నీటిని వడకట్టి దాంట్లో చెంచా తేనె, రెండు చెంచాల నిమ్మరసం కలిపి తీసుకోవాలి.
* ప్రయోజనాలు:
* ఈ టీని రోజూ తాగడం వల్ల జలుబు, దగ్గు లాంటి వాటి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా శ్వాస సంబంధ సమస్యలు తగ్గుతాయి.
* ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది.


నిమ్మ టీ:

తయారీ:  గిన్నెలో రెండు కప్పుల నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిలో రెండు చెంచాల తేయాకు వేసి నిమిషంపాటు చిన్నమంటపై మరిగించి వడకట్టాలి. ఇందులో పెద్ద చెంచా నిమ్మరసం, రెండు చెంచాల తేనె కలిపి వేడిగా  తాగేయాలి.
ప్రయోజనాలు:
* గొంతు సమస్యలను తగ్గిస్తుంది.
* రోగనిరోధకతను పెంచుతుంది. * బరువును నియంత్రిస్తుంది.


అల్లం టీ...

తయారీ: రెండు కప్పుల నీటిని బాగా మరిగించాలి. ఈ నీటిలో  అల్లం తురుము వేసి పదినిమిషాలపాటు మరిగించాలి. ఈ నీటిని గ్లాసులోకి తీసుకుని తేనె కలిపి వేడి వేడిగా తాగేస్తే సరి.
ప్రయోజనాలు:
* మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
* రక్తపోటు అదుపులో ఉంటుంది.



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.