close

తాజా వార్తలు

Published : 02/05/2020 17:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆస్తిపన్ను చెల్లింపుల్లో వారికి రాయితీ

ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలోని నగరపాలికలు, పురపాలికలు, జీహెచ్‌ఎంసీ పరిధిలో ముందస్తు ఆస్తిపన్ను చెల్లించేవారికి రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి చెల్లించాల్సిన ఆస్తిపన్ను ఈనెల 31లోగా చెల్లించేవారికి 5 శాతం రిబేట్‌ కల్పిస్తున్నట్లు అర్వింద్ కుమార్ తెలిపారు. పాత బకాయిలతోపాటు ఈ ఏడాది ఆస్తి పన్ను చెల్లించి రిబేట్‌ పొందవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఏడాదికి రూ.30 వేలలోపు ఆస్తిపన్ను చెల్లించే నివాస యాజమాన్యాలకే ఈ రాయితీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.