close

తాజా వార్తలు

Published : 02/05/2020 19:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వ్యవసాయానికి అచ్చేదిన్‌ రావాలని..!

సంస్కరణలు, సాంకేతికపై చర్చించిన ప్రధాని మోదీ

దిల్లీ: వ్యవసాయ రంగంలో సంస్కరణలపై ప్రధాని నరేంద్రమోదీ శనివారం చర్చించారు. వ్యవసాయ మార్కెటింగ్‌, రైతులకు రుణ సదుపాయం, వ్యవసాయ రంగంపై ఆంక్షలు తొలగించి కొత్త చట్టాలు చేయడంపై ఆయన దృష్టి సారించారు. జీడీపీలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15% ఉండగా దేశంలోని సగం మందికి ఉపాధి కల్పిస్తోన్న సంగతి తెలిసిందే.

లాక్‌డౌన్‌లో అన్ని రంగాలకూ ఇబ్బందులు ఎదురైనప్పటికీ వ్యవసాయ పనులు సాఫీగా సాగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పంటలపై బయో టెక్నాలజీ ప్రభావం, ఉత్పత్తి పెంచడం, ఖర్చులు తగ్గించడంపై మోదీ ఈ సమావేశంలో చర్చించారు. శరవేగంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధిబాట పట్టించేందుకు ఇప్పటికే ఉన్న మార్కెటింగ్‌ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలపై మాట్లాడారు. ఈ రంగాన్ని లాభసాటిగా మార్చే మౌలిక వసతుల కల్పనకు రుణ ప్రవాహం, పీఎం కిసాన్‌ లబ్ధిదారులకు కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల డ్రైవ్‌, రైతులకు తగిన లాభాలు అందేందుకు అంతర్‌ రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం వంటి అంశాలపై చర్చ సాగింది.

ఈ-కామర్స్‌తో అనుసంధానం చేసేలా eNAM లేదా జాతీయ వ్యవసాయ మార్కెట్‌ను ‘వేదికల వేదిక’గా అభివృద్ధి చేయనున్నారు. వ్యవసాయ రంగంలోకి కొత్త సాంకేతికత, విధానాలు, పెట్టుబడులు పెట్టేలా దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావడంపై సమాలోచించారు.

చిన్న, మధ్య తరహా రైతుల ప్రయోజనాలను కాపాడటంలో వ్యవసాయ భూముల లీజింగ్‌ చట్టం-2016 సవాళ్లపై చర్చించారు. వ్యవసాయ రంగంలో పెట్టుడులను ఆకర్షించేందుకు ప్రోత్సాహకాలు, కమోడిటీ డెరివేటివ్‌ మార్కెట్లపై సానుకూల ప్రభావం, ఒప్పంద వ్యవసాయం, వ్యవసాయ క్లస్టర్లు, ప్రత్యేక మండళ్ల ఏర్పాటుతో ‘బ్రాండ్‌ ఇండియా’ను అభివృద్ధి చేయడంపై ప్రధాని మాట్లాడారు. అంతర్జాతీయ విపణిలో పోటీ స్థాయికి రైతులు ఎదిగేందుకు సాంకేతికను ఉపయోగించడంపైనే ఆయన ఎక్కువగా దృష్టి సారించారు.

చదవండి: భారత్‌లో మహమ్మారి మారిందా?

చదవండి: అమెరికాలో మొదట భారత ఔషధాన్నే వాడుతున్నారు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.