close

తాజా వార్తలు

Published : 06/05/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరీంనగర్‌లో సరి-బేసి విధానం

కరీంనగర్‌: కరీంనగర్‌ మున్సిపల్‌ పరిధిలోని దుకాణాల్లో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు కమిషనర్‌ క్రాంతి తెలిపారు. దీని కోసం మున్సిపల్‌ సిబ్బంది ద్వారా దుకాణాలకు నంబర్లు కేటాయించారు. కేటాయింపు ప్రకారం సరి -బేసి తేదీల్లోనే దుకాణాలు తెరవాల్సి ఉంటుందని కమిషనర్‌ స్పష్టం చేశారు. ‘‘కార్పొరేషన్‌లో మూడు కేటగిరీలుగా దుకాణాలు విభజించాం. కేటగిరీ-ఎలో నిత్యావసరాలు, మద్యం, నిర్మాణ రంగానికి చెందిన దుకాణాలు ఉంటాయి. వీటిని ఉదయం నుంచి సాయంత్రం వరకు తెరవొచ్చు. కేటగిరీ -బిలో వస్త్ర, పాదరక్షల దుకాణాలు ఉంటాయి. వీటికి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తారు. ఇక కేటగిరీ - సిలో హోటళ్లు, స్కూల్స్‌, థియేటర్లు, జిమ్ములు ఉంటాయి. వీటిని పూర్తిగా తెరవకూడదు’’ అని కమిషనర్‌ క్రాంతి తెలిపారు.
 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.