close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 08/05/2020 00:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోరంత లవంగం కొండంత మేలు!

మామూలు రోజుల్లో దగ్గు ఇబ్బంది పెడుతుంటే ఓ లవంగ మొగ్గని బుగ్గన పెట్టుకుని ఉపశమనం పొందుతాం. అదొక్కటే కాదు.. దీంతో ఇంకా ప్రయోజనాలున్నాయి...

సుగంధద్రవ్యాల్లో ఒకటైన లవంగాన్ని ‘దేవకుసుమ’ అనికూడా పిలుస్తారు. దీన్ని ఆయుర్వేద ఔషధాల్లో విరివిగా ఉపయోగిస్తారు. దీంట్లోని సుగంధ తైలాలు ఔషధంగా పనిచేస్తాయి. లవంగం నుంచి విటమిన్‌-సి లభిస్తుంది.

కఫం తగ్గాలంటే: మిరియాలు, లవంగాల పొడిలో కాస్త తేనె కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.

దప్పిక తీరాలంటే: దాహం ఎక్కువగా ఉన్నప్పుడు.. నీళ్లు మరిగించి అందులో నాలుగైదు లవంగాలు వేసి ఆ రసాన్ని తాగితే దప్పిక తగ్గుతుంది.

పొడి దగ్గుకు: వేయించిన లవంగాలను నోట్లో పెట్టుకుని చప్పరిస్తే పొడి దగ్గు తగ్గుతుంది.

ఆయాసం తగ్గడానికి: దగ్గు, జలుబు, ఆయాసంతో బాధపడేవాళ్లకు లవంగ తైలం చాలా మంచిది.

దుర్వాసన రాకుండా: వేడినీళ్లలో లవంగాలను వేసుకుని తాగితే కడుపులో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. నోటి దుర్వాసన రాకుండా ఉంటుంది. గ్రీన్‌టీలో లవంగాలను వేసుకుంటే మరీ మంచిది.

అజీర్తి లేకుండా: అజీర్తితో బాధపడేవాళ్లు భోజనానికి ముందు లవంగాన్ని నోట్లో పెట్టుకుంటే సరి.

వికారానికి: లవంగాల పొడిలో నిమ్మరసం కలిపి తీసుకుంటే కడుపులో తిప్పడం తగ్గుతుంది.

తలనొప్పి వేధిస్తుంటే: తలనొప్పి, వాంతులతో బాధపడుతున్నప్పుడు.. చిటికెడు లవంగాల పొడిలో అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది.

పంటినొప్పికి: పన్నునొప్పి ఉన్నచోట లవంగ తైలంలో ముంచిన దూదిని ఉంచితే ఉపశమనం లభిస్తుంది.

జాగ్రత్తలు: ప్రయోజనాలు ఎన్ని ఉన్నా లవంగాలను ఎప్పుడూ మితంగా తీసుకోవాలి. ఎక్కువ వాడితే కడుపులో మంట పుడుతుంది.

నెలల  నిండాక:  గర్భిణులకు నెలలు నిండాక ఒక్కోసారి పొట్ట బిగించినట్టుగా, ఉంటుంది. అలాంటప్పుడు లవంగాన్ని బుగ్గన పెట్టుకుంటే ఉపశమనంగా ఉంటుంది.

- డా. పెద్ది రమాదేవి, ఆయుర్వేద నిపుణులు

మరిన్ని ఆర్టికల్స్‌ కోసం వసుంధర.నెట్‌ని చూడగలరు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.