close

తాజా వార్తలు

Published : 09/05/2020 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సాయిపల్లవికి బర్త్‌డే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన రానా

సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో

హైదరాబాద్‌: నటి సాయిపల్లవి పుట్టినరోజును పురస్కరించుకుని కథానాయకుడు రానా స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. రానా, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. విప్లవం, ప్రేమ అనే రెండు విభిన్న కాన్సెప్ట్‌ల ప్రధానాంశంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌, శ్రీలక్ష్మి వెంకటేశ్వర సినిమాస్‌ సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్‌ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి కేవలం రానా లుక్‌ మాత్రమే బయటకు వచ్చింది.

తాజాగా సాయిపల్లవి పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం రానా ‘విరాటపర్వం’ చిత్రం నుంచి ఆమె లుక్‌ విడుదల చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ వేదికగా సాయిపల్లవికి విషెస్‌ తెలిశారు. రానా షేర్‌ చేసిన లుక్‌లో సాయిపల్లవి అమరవీరుల స్థూపం దగ్గర కూర్చుని ఎదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్లు కనిపించారు. ఈ ఫొటో సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ సినిమాలో ఆమె నక్సలైట్‌గా కనిపించనున్నారంటూ ప్రచారం సాగుతోంది. కరోనా కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.