close

తాజా వార్తలు

Published : 11/05/2020 21:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇరాన్‌: సొంత నౌకపై క్షిపణి ప్రయోగం

19 మంది నేవీ సిబ్బంది మృతి, మరో 15 మందికి గాయాలు 

టెహ్రాన్‌: సైనిక శిక్షణ విన్యాసాల్లో భాగంగా ఇరాన్‌కు చెందిన యుద్ధ నౌక ప్రయోగించిన క్షిపణి ఆ దేశానికి చెందిన మరో యుద్ధ నౌకను ఢీకొట్టింది. ఈ ఘటనలో 19 ఇరాన్ నావికా దళ సిబ్బంది చనిపోగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్‌ జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1,270 కి.మీ దూరంలో గల్ఫ్‌ ఆఫ్ ఒమన్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలి కాలంలో ఇరాన్‌, అమెరికా మధ్య ఉద్రిక్తపరిస్థితులు చోటుచేసుకోవడంతో ఇరాన్‌ తరచుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఆదివారం జమరాన్‌ అనే యుద్ధ నౌక ప్రయోగించిన క్షిపణి ప్రమాదవశాత్తూ కొనరాక్‌ అనే యుద్ధ నౌకను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొనరాక్ తీవ్రంగా దెబ్బతిందని, ప్రమాద సమయంలో రెండు నౌకలు దగ్గరగా ఉండటం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక మీడియా పేర్కొంది.

కొనరాక్‌ నౌక సముద్ర ఉపరితలం నుంచి యుద్ధ నౌకలపై క్షిపణులను ప్రయోగించగలదు. నెదర్లాండ్‌లో తయారు చేసిన ఈ యుద్ధ నౌక 1988 నుంచి ఇరాన్ నావికా విభాగంలో సేవలందిస్తోంది. 2018లో ఈ నౌకకు మరమ్మత్తులు నిర్వహించారు. ఇందులో మొత్తం 20 మంది సిబ్బంది ఉంటారు. ప్రపంచంలో 20 శాతం చమురు రవాణా పర్షియన్‌ గల్ఫ్‌ గుండా జరుగుతుంటుంది. దీనికి దగ్గరగానే హర్మూజ్‌ జలసంధి ఉంది. ఈ ప్రాంతంలోనే ఇరాన్‌ తరచుగా సైనిక విన్యాసాలు చేపడుతుంది. ఇరాన్‌లో ఈ ఏడాదిలో ఇది రెండో అతి పెద్ద ప్రమాద ఘటన. జనవరిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ ప్రమాదవశాత్తూ ఉక్రెయిన్‌కు చెందిన ప్రయాణికుల విమానాన్ని కూల్చేసింది. ఈ ఘటనలో 176 మంది చనిపోయారు.       


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.