close

తాజా వార్తలు

Published : 12/05/2020 00:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఎండలపై నీళ్లు చల్లుదాం

మండే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చల్లచల్లని పానీయాలని ప్రయత్నించండి. రుచిని ఆస్వాదిస్తూ.. ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.


నిమ్మ+ తులసి: నిమ్మరసంతో విటమిన్‌ సి శరీరానికి పుష్కలంగా అందుతుంది. ఈ రసానికి కాసిని తులసి ఆకులు కూడా కలిపి తాగితే వడదెబ్బ నుంచి రక్షణ లభిస్తుంది.


పుదీనా+ జీలకర్ర: పుదీనా రసంలో కొద్దిగా బెల్లం లేదా చక్కెర, జీలకర్రపొడీ, నిమ్మరసం వేసుకుని రసంలా చేసుకుంటే రుచి బాగుంటుంది. ఈ పానీయం శరీరానికి చల్లదనం అందివ్వడమే కాకుండా.. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. జీర్ణక్రియ పనితీరునూ మెరగుపరుస్తుంది. ఈ పానీయంలో బి, సి విటమిన్లు, ఇతర పోషకాలూ ఉంటాయి.


పచ్చిమామిడి+ జీలకర్ర: పచ్చిమామిడిని రసంలా చేసుకుని అందులో జీలకర్ర వేసి తీసుకుంటే.. వడదెబ్బ తగలకుండా ఉంటుంది. దాంతోపాటూ శరీరానికి అవసరమైన శక్తినీ అందిస్తుంది. దాహాన్ని తగ్గిస్తుంది. ఇందులో పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.