close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 12/05/2020 00:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రభుత్వ ఉద్యోగాలు

ఐసీఎఫ్‌, చెన్నై

చెన్నైలోని భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 62. పోస్టులు-ఖాళీలు: మెడికల్‌ ప్రాక్టీషనర్లు(జీడీఎంఓ)-14, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌-24, హౌస్‌ కీపింగ్‌ అసిస్టెంట్‌(సఫాయివాలా)-24. అర్హత: పోస్టును అనుసరించి పదోతరగతి, జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: మే 17, 2020.

https://icf.indianrailways.gov.in/

పాన్‌ హాన్స్‌ లిమిటెడ్‌

నోయిడా ప్రధానకేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వరంగ మినీరత్న సంస్థ అయిన పాన్‌ హాన్స్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 08 పోస్టులు: సీనియర్‌ అసోసియేట్స్‌, అసోసియేట్స్‌, బేస్‌ అసిస్టెంట్‌, బేస్‌ హెల్పర్‌, బేస్‌ కోఆర్డినేటర్‌.

అర్హత: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, సంబంధిత అనుభవం. ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరి తేది: మే 25, 2020.

https://www.pawanhans.co.in/

ఇంటర్న్‌షిప్‌

సెబీ, ముంబయి

ముంబయిలోని సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా(సెబీ) 2020-21 సంవత్సరానికి కింది ప్రోగ్రాములో ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు కోరుతోంది.

ఎకనామిక్‌ అండ్‌ పాలిసీ అనాలిసిస్‌ విభాగంలో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం

అర్హత: ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌కు సంబంధించిన అంశంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌.

ఈమెయిల్‌: prabhakarrp@sebi.gov.in

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 10, 2020.

వెబ్‌సైట్‌: https://www./sebi.gov.in/

స్కాలర్‌షిప్‌

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, ఇతర వెనుకబడిన తరగతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ చదివే అభ్యర్థులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 8 లక్షలు మించకూడదు.

వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరి తేది: మే 27, 2020

వెబ్‌సైట్‌: http://nosmsje.gov.in/


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.