close

తాజా వార్తలు

Published : 12/05/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అరచేతిలో నాణెం.. మాయం!

మనం ఈరోజు ఓ మ్యాజిక్‌ నేర్చుకుందాం. అందరూ చూస్తుండగానే నాణెం మాయం చేయడం అన్నమాట. ఇంకెందుకాలస్యం చదివేయండి మరి.

* మీరు అరచేతిలోకి నాలుగు నాణేలు (కాయిన్స్‌) తీసుకోండి.
* వాటిని అందరికీ చూపించండి.
* ఇప్పుడు మరో చేతిని ఈ చేతిపై పెట్టండి.
* అబ్రకదబ్ర.. హాంఫట్‌.. అంటూ చేతులు అటూ ఇటూ తిప్పండి.
* ఇప్పుడు చేతులు చూపించండి మూడు నాణేలే ఉంటాయి.
* అరె.. మేం ఎంత ప్రయత్నించినా రావడం లేదే.. అని చిన్నబుచ్చుకోకండి.
* ఓ చిన్న ట్రిక్‌ ఉంది దీని వెనక. అదేంటో తెలుసుకుంటే ఎంచక్కా మీరూ చేసేయొచ్చు.


కిటుకు:

* ఈ మ్యాజిక్‌ చేయడానికి ముందు మనం ఓ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.
* దీని కోసం అల్యూమినియం ఫాయిల్‌ అవసరం అవుతుంది. పెద్ద పెద్ద హోటళ్లలో చెఫ్‌లు దీన్ని వాడుతుంటారు. షాపుల్లో, ఆన్‌లైన్‌లోనూ ఇది దొరుకుతుంది.
* అమ్మానాన్న సహకారంతో ఓ చిన్న అల్యూమినియం ఫాయిల్‌ ముక్క కత్తిరించి తీసుకోండి.
* దీన్ని నాణెం మీద పెట్టి మరో నాణెంతో రాయండి. అప్పుడు అల్యూమినియం ఫాయిల్‌ మీద కింద ఉన్న నాణెం గుర్తు పడుతుంది.
* ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్‌ను నాణెం మీద నుంచి తీయండి.
* కత్తెరతో అమ్మానాన్నను నాణెం అచ్చుపడ్డ అల్యూమినియం ఫాయిల్‌ను జాగ్రత్తగా కాయిన్‌లా కత్తిరించి ఇవ్వమనండి.

* ఇంకేం నకిలీ నాణెం సిద్ధం. మీరు మ్యాజిక్‌ చేసే సమయంలో దీంతోపాటు నిజమైన మరో మూడు నాణేలు చూపించండి. తర్వాత ఈ నకిలీ నాణెంను చేతులు మూసివేసిన తర్వాత లాఘవంగా నలిపేయండి.

* అల్యూమినియం ఫాయిల్‌ను చాలా తేలిగ్గా దాదాపు కాగితంలా నలిపేసి ఉండ చేసేయొచ్చు.

* దీన్ని అవతలవారికి కనిపించకుండా వేళ్లమధ్య పెట్టుకోవాలి.. లేదా కిందకు నెమ్మదిగా జారవిడిస్తే సరి.
* తర్వాత చేతులు తెరిస్తే నాలుగు నాణేల స్థానంలో మూడే ఉంటాయి.
* చూసేవారంతా ఆశ్చర్యపోతారు. అవసరమైతే ఇలాంటి నకిలీ నాణేలు ఓ అయిదారు చేసిపెట్టుకోండి. మనల్ని మళ్లీ చేయమన్నప్పుడు చేసి చూపించడానికి పనికి వస్తాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.