జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ
close

తాజా వార్తలు

Updated : 12/05/2020 12:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాతినుద్దేశించి ప్రసంగించనున్న మోదీ

దిల్లీ: ఈనెల 17తో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరోసారి జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఇవాళ రాత్రి 8గంటలకు మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ సందర్భంగా ప్రధాని లాక్‌డౌన్ సడలింపులు, కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలపై కీలక ప్రకటన చేసే అవకాశముంది. ఈ నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

దేశంలో కరోనా కట్టడిపై ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలు ఏవిధంగా ఉన్నాయి... ఎలాంటి సత్ఫలితాలనిచ్చాయనే విషయాలను మోదీ తన ప్రసంగంలో ప్రస్తవించనున్నట్లు సమాచారం. నిన్న వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అనేక విషయాలు చర్చించారు.  ఆర్థిక పరమైన కార్యకలాపాలు కొనసాగించేందుకు చర్యలను మరింత ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్బంగా సీఎంలు స్పష్టం చేశారు. అదే సందర్భంలో కరోనాను ఎదుర్కొనే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో ఎలాంటి లోటుపాట్లు  లేకుండా ముందుకు వెళ్లేలా సూచనలు, సలహాలు ఈనెల 15లోపు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామనేది ప్రధాని తన ప్రసంగం ద్వారా నేడు ప్రజలకు వివరించే అవకశాముంది.  వైద్యపరంగా ఇప్పటి వరకు వచ్చిన అంశాలన్నింటినీ పరిశీలిస్తున్నామని చెప్పటంతో పాటు దేశ ప్రజల నుంచి కూడా పలు సూచనలు, సలహాలు కోరే ఆస్కారం కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ -3 కొనసాగించాలా? కొనసాగిస్తే ఎక్కడెక్కడ కొనసాగించాలి? .. ఈ అంశాలపై ప్రధాని ప్రసంగంలో స్పష్టత ఇచ్చే అవకాశముంది.

వలస కూలీల వ్యవహారంపై..

వలస కూలీల  వ్యవహారంపై మోదీ తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. పలువురు కూలీలు ఇటీవల చోటు చేసుకున్న రైలు ప్రమాదంలో మృతి చెందారు. మరికొంత మంది స్వస్థలాలకు నడిచి వెళ్తూ మరణించారు. వలస కూలీలు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. మరి కొన్ని రాష్ట్రాలు వచ్చిన వారి విషయంలో అలసత్వం ప్రదర్శించడంపై  ప్రధాని అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పలు చోట్ల లాక్‌డౌన్‌ నిబంధనల అమలులో ప్రజలు ఇష్టా రీతిలో వ్యవహరించడంపై కూడా ప్రధాని మాట్లాడే అవకాశముంది.

 

 

 Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని