close

తాజా వార్తలు

Updated : 12/05/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ. 20లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ: మోదీ

దిల్లీ: కరోనాతో దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఆత్మ నిర్భర్‌ భారత్‌ అభియాన్‌ పేరిట రూ.20లక్షల కోట్లతో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. ఇది మన దేశ జీడీపీలో 10 శాతమని తెలిపారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ మట్లాడుతూ..  ‘‘కరోనాతో నాలుగు నెలలకు పైగా ప్రపంచం పోరాడుతోంది. కరోనాపై విజయం సాధించేందుకు అందరూ కలిసి పోరాడుతున్నారు. ఈ వైరస్‌ ప్రపంచానికి తీవ్ర నష్టం కలిగించింది. ప్రస్తుతం ప్రపంచం సంక్షోభంలో ఉంది. మరింత సంకల్పంతో పోరాడాల్సిన సమయమిది. ఈ ఆపద మనకో సంకేతం.. సందేశం ఇచ్చింది. ఈ ఆపద మనల్ని అవసరం వైపు నడిపించింది’’ అన్నారు.

ప్యాకేజీతో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊతం

ఈ ప్యాకేజీపై రేపట్నుంచి ఆర్థికమంత్రి వివరాలు అందిస్తారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఆర్థిక ప్యాకేజీ ద్వారా ఊతమిస్తాం. భారత్‌ సర్కార్‌ నుంచి వెళ్లే ప్రతి రూపాయీ ప్రతి శ్రామికుడు, రైతు జేబులోకి నేరుగా వెళ్తుంది. 21వ శతాబ్దపు ఆకాంక్షలకు తగినట్టు ఈ ప్యాకేజీ రూపకల్పన, నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు దోహదం చేస్తుంది. ఆర్థిక ప్యాకేజీపై కరోనా పోరాటంలో ప్రతిఒక్కరికీ చేయూతనిస్తుంది. దేశంలో ప్రతి పారిశ్రామికుడిని కలుపుకొని పోయేలా ప్యాకేజీ ఉపయోగపడుతుంది. భారత పారిశ్రామిక రంగానికి మరింత బలాన్ని చేకూర్చేందుకు ప్యాకేజీ ఉపయోగకరంగా ఉంటుంది’’ అని తెలిపారు.

మరో కొత్త విప్లవానికి నాంది

‘‘జన్‌ధన్‌ అభియాన్‌తో ఒక విప్లవాన్ని చూశాం. ఇప్పుడు మరో కొత్త విప్లవానికి నాంది పలకబోతున్నాం. భవిష్యత్తులో వ్యవసాయంపై ప్రభావం పడకుండా ఏర్పాట్లు. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణకు ఆలంబనగా నిలుస్తుంది. జన్‌ధన్‌, ఆధార్‌, మొబైల్‌ (జామ్‌) సూత్రం ఎంతో ఉపయోగపడింది. ప్రపంచ పంపిణీ వ్యవస్థలో భారత్‌ది కీలక పాత్ర. మేకిన్‌ ఇండియా కల సాకారం చేయడానికి ఈ ప్యాకేజీ దోహదం చేస్తుంది. మన సామర్థ్యం, నాణ్యత అన్నింట్లోనూ నూతన ప్రమాణాలకు నాంది పలుకుతుంది. నాలుగో దశ లాక్‌డౌన్‌కు కొత్త రూపురేఖలు ఇద్దాం. స్థానిక మార్కెట్లు, స్థానిక పంపిణీ వ్యవస్థలు బలోపేతం కావాలి’’ అన్నారు. 

ప్రపంచ దేశాల్ని ఆదుకోవడంలో భారత్‌ ముందుంటుంది

‘‘కరోనా నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ ముందుకు సాగాలి. కరోనాకు ముందు కరోనా తర్వాత అని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. భారత్‌లో కూడా అనేకమంది అయినవారిని కోల్పోయారు. ఒకే ఒక్క వైరస్‌ ప్రపంచాన్ని తలకిందులు చేసింది. ప్రపంచం మొత్తం ప్రాణం కోసం యుద్ధం చేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు.. వినలేదు. మన పోరాట సంకల్పాన్ని మరింత బలపరుచుకోవాలి.  ప్రపంచ వ్యాప్తంగా నేటి పరిస్థితి నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉంది.  ప్రపంచ మానవాళికి ఇదో పెద్ద సవాల్‌. ఒక చిన్న వైరస్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇలాంటి పరిస్థితిని మునుపెన్నడూ చూడలేదు. కరోనాతో వచ్చిన సవాళ్లను మనం అధిగమించాం.. అప్పుడు మన దగ్గర ఒక్క పీపీఈలు, N -95 మాస్క్‌లు ఉత్పత్తి కాలేదు. కానీ, ఇప్పుడు వాటిని లక్షల్లో తయారు చేస్తున్నాం. రోజూ 2లక్షల పీపీఈ కిట్లు, 2లక్షల N - 95మాస్కుల్ని తయారుచేస్తున్నాం. వసుధైక కుటుంబం భావనలో ప్రపంచ దేశాల్ని ఆదుకొనేందుకు భారత్‌ ముందుంటుంది’’ అని చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.