close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 13/05/2020 01:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

పిల్ల చేష్టల్ని...పసిగట్టాల్సిందే!

సెక్యూరిటీ

స్కూళ్లకు సెలవులు రావడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారా! ఎప్పుడూ వచ్చే వేసవి సెలవులే అయితే సరదాగా స్నేహితులతో ఆరుబయట ఆడేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌తో ఇంట్లో నుంచి బయటకు రాలేని పరిస్థితి. మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారు! గేమ్స్‌ ఆడతా అంటూ స్మార్ట్‌ఫోన్‌తో గడిపేస్తున్నారా.. ప్రాజెక్టు వర్క్‌ ఉందంటూ ట్యాబ్లెట్‌తో కుస్తీ పడుతున్నారా! సినిమా చూస్తా.. అంటూ ల్యాప్‌టాప్‌తో ఆడేస్తున్నారా! అయితే వారేం చేస్తున్నారో మీరు నిఘా పెట్టడం అనివార్యం. అందుకు కొన్ని టిప్స్‌ పాటించాల్సిందే !

వెబ్‌ విహారం చేస్తే..

ఫోన్‌లో కావచ్ఛు పీసీలో అయ్యుండొచ్ఛు. పిల్లలు నెట్టింట్లో వెబ్‌ విహారం చేసేటప్పుడు ‘సేఫ్‌ బ్రౌజింగ్‌ సెట్టింగ్స్‌’ పెట్టుకోవాలి. దీంతో అనవసర ఫొటోలు, వీడియోలు కనిపించవు. అలాగే మీరు వాడే వెబ్‌ బ్రౌజర్‌లో ‘యాడ్‌ బ్లాకర్‌’ సెట్‌ చేసుకోండి. దీంతో స్క్రీన్‌పై ప్రకటనలు కనిపించవు. ప్రైవసీకి ప్రాధాన్యం ఇచ్చే ఒపెరా లాంటి కొన్ని బ్రౌజర్స్‌లో ఈ ఆప్షన్‌ ఇన్‌బుల్ట్‌గా ఇచ్చేస్తున్నాయ్‌. అలాగే, బ్రౌజర్‌లో పిల్లలకు ప్రత్యేకంగా యూజర్‌ని క్రియేట్‌ చేసి ఇవ్వండి. దీంతో వారేం చేస్తున్నారో ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం సులభం అవుతుంది. యూజర్‌ ఎకౌంట్‌లో పిల్లలకు తగినట్టుగా అన్ని మార్పులూ చేయొచ్ఛు ఉదాహరణకు బ్రౌజర్‌లో కనిపించే ఫాంట్‌ సైజుని పెంచొచ్ఛు ప్రైవసీ సెట్టింగ్స్‌ని కట్టుదిట్టం చేయొచ్చు.

మొబైల్‌ వాడితే..

ఫోన్‌లో ఏది చేయాలన్నా యాప్‌లతోనే పని. వెతుకులాట కూడా. పిల్లలు వెతికేటప్పుడు పొరపాటుగా ఎలాంటి అసభ్యకరమైన సెర్చ్‌ రిజల్ట్‌లు కనిపించొద్దు అనుకుంటే ఆయా సెర్చ్‌ యాప్‌ల్లోకి వెళ్లి ‘సేఫ్‌ సెర్చ్‌’ ఎనేబుల్‌ చేయాలి. ఉదాహరణకు ఆండ్రాయిడ్‌ ఫోన్‌లలోని గూగుల్‌ సెర్చ్‌ యాప్‌లోని సెట్టింగ్స్‌ని ఓపెన్‌ చేయండి. దాంట్లోని ‘జనరల్‌’లోకి వెళ్తే ‘సేఫ్‌ సెర్చ్‌’ కనిపిస్తుంది. ట్యాప్‌ చేసి ఎనేబుల్‌ చేయండి చాలు. ఇదే మాదిరిగా పిల్లల చేతికి ఫోన్‌ ఇచ్చాక అన్నింటిపైనా పెద్దల నియంత్రణకి గూగుల్‌ అందించే ‘ఫ్యామిలీ లింక్‌’ యాప్‌ని వాడొచ్ఛు రోజులో ఎంత సమయం పాటు ఏయే యాప్‌లను వాడాలనేది ముందే నిర్ణయించొచ్ఛు అంతేకాదు.. ప్లే స్టోర్‌లోని ఇతర యాప్‌ల జోలికి పోకుండా చూడొచ్ఛు పిల్లలకు తగిన యాప్‌లు ఏమున్నాయో తెలుసుకుని వాటిని మాత్రమే వాడేలా ప్రోత్సహించొచ్ఛు ఇదే తరహాలో మైక్రోసాఫ్ట్‌ కూడా వినియోగదారులకు ‘మైక్రోసాఫ్ట్‌ ఫ్యామిలీ సేఫ్టీ’ సర్వీసుని ప్రవేశపెట్టింది. దీంతో మీ పిల్లల డిజిటల్‌ ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచొచ్చు.

మ్యూజిక్‌ వింటున్నారా?

టీన్స్‌ మ్యూజిక్‌ ట్రాక్స్‌ని కూడా నియంత్రించేందుకు వీలుంది. అందుకు Spotify, Amazon Prime Music లాంటి మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సర్వీసులు ప్రత్యేక ఆప్షన్స్‌ని ప్రవేశపెట్టాయి. వాటితో అభ్యంతరంగా అనిపించే ట్రాక్స్‌ని ప్లే అవ్వకుండా చేయొచ్ఛు ఇక అప్పుడప్పుడు మా టీచర్‌తో మాట్లాడాలనో.. ఫ్రెండ్స్‌తో ముచ్చట్లు పెట్టాలనో ఫోన్‌ నుంచి వీడియో కాల్స్‌ చేస్తున్నట్లయితే సురక్షితమైన యాప్‌లను వాడేలా అవగాహన కల్పించండి. తప్పక టూ ఫ్యాక్టర్‌ అథెంటిఫికేషన్‌ యాప్స్‌ని వినియోగించండి. దీంతో ఎప్పుడైనా ఆయా సర్వీసుల్లోకి లాగిన్‌ అయ్యే ప్రయత్నం చేస్తే కచ్చితంగా మీ అనుమతి అవసరం అవుతుంది. పిల్లలు యాప్‌లను మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా వాడేందుకు వీలు లేకుండా టూ ఫ్యాక్టర్‌ అథెంటిఫికేషన్‌ యాప్‌లతో బ్లాక్‌ చేయొచ్చు.

స్ట్రీమింగ్‌లోనూ ప్రత్యేకం..

థియేటర్లకు వెళ్లేది లేదు. దీంతో ఇప్పుడు ఓటీటీలపైనే వినోదం అంతా. అందుకే నెట్‌ఫ్లిక్స్‌ లాంటి ఓటీటీ సర్వీసుల్లోనూ పిల్లలకు తగిన సినిమాలకు ‘కిడ్స్‌ ప్రొఫైల్‌’ని క్రియేట్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు.. పెద్దల ప్రొఫైళ్లు ఓపెన్‌ కాకుండా పిన్‌తో సెక్యూర్‌ చేసుకునే వెసులుబాటుని కొత్తగా ప్రవేశపెట్టింది. దీంతో వెబ్‌సిరీస్‌లు, సినిమాలు కనిపించకుండా చేయొచ్ఛు పిల్లలు ఏయే సినిమాలు చూస్తున్నారో ఎప్పటికప్పుడు చెక్‌ చేయొచ్ఛు అంతేకాదు, స్క్రీన్‌టైం, డిజేబుల్‌ ఆటోప్లేతో పాటు మీ పిల్లలు చూసిన హిస్టరీని చూస్తూ ఎప్పటికప్పుడు వారిని ట్రాక్‌ చేయొచ్ఛు ఇక హాట్‌స్టార్‌.. డిస్నీ హాట్‌స్టార్‌ పేరుతో పిల్లలకు ప్రత్యేక ఓటీటీ సేవలను అందిస్తోంది. పిల్లలు చూడదగిన యానిమేషన్‌ సినిమాల్ని జాబితాగా పొందొచ్ఛు ‘కిడ్స్‌ సేఫ్‌’ బటన్‌తో హాట్‌స్టార్‌లోని మరే ఇతర కంటెంట్‌ పిల్లల కంటపడకుండా చేయొచ్ఛు అలాగే, ఎప్పుడంటే అప్పుడు ఓపెన్‌ చేసే యూట్యూబ్‌లోనూ ప్రత్యేకంగా ‘కిడ్స్‌ వర్షన్‌’ అందుబాటులో ఉంది. దాంతో కేవలం పిల్లలకు సంబంధించిన వీడియోలు మాత్రమే చూడొచ్ఛు యూట్యూబ్‌లో వీడియోలను వెతుకుతున్నప్పుడు అసభ్యకరమైనవి కనిపించకుండా సెర్చ్‌ ఫిల్టర్‌ Restricted Mode ఎనేబుల్‌ చేయొచ్చు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.