close

తాజా వార్తలు

Published : 14/05/2020 21:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం

ప్రకాశం జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగలుప్పలపాడు మండలం రాపర్ల సమీపంలో మిర్చి కూలీలతో వెళ్తున్న  ట్రాక్టర్ అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో తొమ్మిది మంది కూలీలు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మృతులంతా రాపర్ల సమీప గ్రామాలకు చెందిన వారిగా భావిస్తున్నారు. ఈ ఘటనలో ట్రాక్టర్‌ డ్రైవర్‌, మరో మహిళ తీవ్ర గాయాలు కాగా.. వీరిని చికిత్స నిమిత్తం ఒంగోలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఏపీలో ‘పది’ పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. జులై 10 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది. అయితే ఈసారి పదో తరగతి పరీక్షల్లో పలు కీలక మార్పులు చేసింది. ప్రతి సబ్జెక్ట్‌కు ఒక్కో పేపర్‌ మాత్రమే పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. గతంలో నిర్వహించిన మొత్తం 11 పేపర్లను ఈసారి 6 పేపర్లకు కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. గృహ రుణాలపై మధ్యతరగతికి ఊరట  

గృహ రుణాలు తీసుకున్న మధ్యతరగతికి ఈ కరోనా కాలంలో కేంద్రం ఊరట కల్పించింది. గృహ నిర్మాణ రంగాన్ని బలోపేతం చేసేందుకు గృహ‌, నిర్మాణ రంగాలకు రూ.70వేల కోట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా మే 2017 నుంచి అమలులో ఉన్న మధ్య ఆదాయ వర్గాలకు గృహ రుణాలపై వడ్డీ రాయితీ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. జూన్‌ మొదటివారంలో ‘టీఎస్‌ బీపాస్‌’:కేటీఆర్‌

భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల్లోదీనిని ప్రవేశపెట్టగా.. సుమారు 1,100 దరఖాస్తులు వచ్చాయని.. సాఫ్ట్‌వేర్‌ ఆధారిత వ్యవస్థకు సంబంధించి వచ్చిన సమాచారం ఆధారంగా రానున్న 15 రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు కేటీఆర్‌ వివరించారు. పూర్త వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. మోదీ ప్యాకేజీ భేష్‌: ఐరాస

భారత ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన పథకంపై ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రశంసల జల్లు కురిపించింది. లాక్‌డౌన్‌ కారణంగా చతికిలపడ్డ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకొనేందుకు ఇది ఉపయోగపడుతుందని ధీమా వ్యక్తం చేసింది. భారీ ఆర్థిక విపణులు, ఉద్దీపనను అమలు చేసే సామర్థ్యం భారత్‌కు ఉందని వెల్లడించింది. భారత జీడీపీ వృద్ధిరేటును 2020-21కి గాను ఐరాస 1.2శాతంగా అంచనా వేసింది. ఇక ప్రపంచ జీడీపీ 3.2 శాతమే ఉంటుందని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. వందే భారత్‌-2: ఎయిరిండియా బుకింగ్స్‌ ఓపెన్‌

వందే భారత్‌ మిషన్‌లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మే 16వ తేదీ నుంచి రెండో దశలో 149 విమానాలను నడపనుంది. ఈ నేపథ్యంలో ఆయా విమానాల్లో టికెట్స్‌ బుకింగ్‌ను ఓపెన్‌ చేసింది. మొదటి దశలో 64 విమానాలను నడిపిన ఎయిరిండియా ఇప్పుడు ఆ సంఖ్యను దాదాపు రెట్టింపు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. 250కి.మీ. ప్రయాణానికి ₹10 వేలు ఛార్జీ 

వందే భారత్ మిషన్‌లో భాగంగా స్వదేశానికి చేరుకున్న వారికి ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం షాకిచ్చింది. దిల్లీలో క్వారంటైన్ ముగించుకున్న వారు సొంత ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారికి ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (యూపీఎస్‌ఆర్టీసీ) క్యాబ్, బస్సు సర్వీసులు అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సేవలకుగాను వసూలు చేస్తున్న ఛార్జీలు మాత్రం ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. 250 కి.మీ ప్రయాణానికి రూ.10,000 అద్దె వసూలుచేయనున్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. శ్రామిక్‌ రైలులో వలసకూలీల అదృశ్యం

సూరత్‌ నుంచి హరిద్వార్‌కు వలసకార్మికులతో వస్తున్న శ్రామిక్‌రైలులోని కొందరు అదృశ్యమైన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే వలసకార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వేశాఖ ఏర్పాటు చేసిన శ్రామిక్‌రైలు మే 12న 1340 మందితో సూరత్‌ నుంచి హరిద్వార్‌కు బయలుదేరింది. అయితే గమ్యస్థానం చేరేటప్పటికి సుమారు 167 మంది వలసకార్మికులు అదృశ్యమైనట్టు అధికారులు గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కోతలకు సిద్ధమవుతున్న  73% కంపెనీలు!

మైహైరింగ్‌క్లబ్‌.కామ్‌, సర్కారినౌకరి.ఇన్ఫో సంస్థలు సంయుక్తంగా మే1 నుంచి 10 వరకు ఈ సర్వే చేపట్టాయి. దేశవ్యాప్తంగా 25 నగరాల్లో 11 రంగాలకు చెందిన 1,124 కంపెనీలు ఇందులో పాల్గొన్నాయి. దాదాపు 73% కంపెనీలు ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు సిద్ధమవుతున్నాయట. 57% యజమానులు తాత్కాలికంగా ఉద్యోగాలు తీసేస్తామని, 21% మంది రెండేళ్ల వరకు శాశ్వత ఉద్యోగాలు తీసేస్తామని వెల్లడించాయి. ఐతే 32% కంపెనీలు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడం లేదని చెప్పడం ఆసక్తికరం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఓటీటీలో విడుదలవుతున్న అమితాబ్‌ చిత్రం

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు, షూటింగ్‌లు రద్దయ్యాయి. దీంతో పలు సినిమాలను ఓటీటీల వేదికగా విడుదల చేసేందుకు చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో  బిగ్‌బి అమితాబ్‌, విలక్షణ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘గులాబో సితాబో’ కూడా వచ్చింది. సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో జూన్‌ 12వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.