close

తాజా వార్తలు

Updated : 16/05/2020 12:24 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

‘ట్రంప్‌.. ముందు ఐరాస బకాయిలు చెల్లించు’

ప్రకటన విడుదల చేసిన చైనా

బీజింగ్‌: కరోనా వైరస్‌ విషయంలో చైనాపై అమెరికా సహా మరికొన్ని దేశాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న వేళ డ్రాగన్‌ దేశం ఆసక్తికర ప్రకటన విడుదల చేసింది. ఐక్యరాజ్య సమితికి వివిధ దేశాలు చెల్లించాల్సిన మొత్తాన్ని గుర్తుచేసింది. వీలైనంత త్వరగా సభ్యదేశాలు బకాయిలను చెల్లించాలని కోరింది. సంస్థకు అగ్రరాజ్యం అమెరికా భారీగా బకాయిపడిందని ప్రకటనలో పేర్కొంది. తద్వారా వైరస్ వ్యాప్తి విషయంలో తమపై ఆరోపణలు చేస్తున్న అమెరికాపై చైనా ప్రతివిమర్శలు చేసే ప్రయత్నం చేసింది. 

‘‘గత కొన్నేళ్ల బకాయిలను కలుపుకొని మే 14 నాటికి ఐరాస సాధారణ బడ్జెట్‌, శాంతిస్థాపన కార్యక్రమ బడ్జెట్‌కు అందాల్సిన సొమ్ము వరుసగా 1.63 బిలియన్‌ డాలర్లు, 2.14 బిలియన్‌ డాలర్లు. ఇప్పటి వరకు అత్యధికంగా బకాయిపడ్డ దేశం అమెరికా. సాధారణ బడ్జెట్‌కు 1.165 బిలియన్‌ డాలర్లు, శాంతిస్థాపన బడ్జెట్‌కు 1.332 బిలియన్‌ డాలర్లు యూఎస్‌ అందించాల్సి ఉంది’’ అని చైనా తన ప్రకటనలో పేర్కొంది. 

ఐరాస బడ్జెట్‌కు అత్యధికంగా 22 శాతం నిధుల్ని అమెరికాయే సమకూరుస్తోంది. ఏటా దాదాపు 3 బిలియన్‌ డాలర్లు అందిస్తోంది. అలాగే శాంతిస్థాపన కార్యక్రమాలకు కావాల్సిన నిధుల్లోనూ 25 శాతం అగ్రరాజ్యమే భరిస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం అమెరికా 27.89 శాతం నిధుల్ని సమకూర్చాల్సి ఉంటుంది. కానీ, ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 25 శాతానికి కుదిస్తూ చట్టం తీసుకొచ్చారు.

చైనా ఆరోపణల్ని అమెరికా తీవ్రంగా ఖండించింది. వైరస్ వ్యాప్తి విషయంలో దోషిగా ఉన్న చైనా అబద్ధాలతో ప్రపంచ దేశాల దృష్టిని మరల్చే ప్రయత్నాల్లో ఇదొకటని ఆరోపించింది. ఇటీవలే శాంతిస్థాపన కార్యక్రమాలకు అమెరికా 726 మిలియన్ డాలర్లు చెల్లించిందని ఐరాసలో యూఎస్‌ శాశ్వత కమిషన్‌ వెల్లడించింది. శాంతిస్థాపన బడ్జెట్‌కు కేవలం 888 మిలియన్‌ డాలర్లు మాత్రమే బకాయిపడ్డామని తెలిపింది. అందులోనూ 66 శాతం నిధులు 2017 నుంచి 25 శాతం లెక్కన ఇవ్వడం వల్ల ఏర్పడ్డవేనని పేర్కొంది. 

ఇదీ చదవండి..

భారతీయులు గొప్ప పరిశోధకులు: ట్రంప్‌


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని