close

తాజా వార్తలు

Published : 20/05/2020 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నూతన వ్యయాలు.. జీడీపీలో 1 శాతమే: ఫిచ్‌

ఉద్దీపనపై ఫిచ్‌ సొల్యూషన్స్‌ విశ్లేషణ
లాక్‌డౌన్‌ ఉపసంహరణతో కరోనా తీవ్రత ముప్పు

దిల్లీ: కేంద్రప్రభుత్వం ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల భారీ ప్యాకేజీ కనిపిస్తున్నంత పెద్దదేమీ కాదని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అభిప్రాయపడింది. ఉద్దీపన వల్ల వాస్తవంగా కనిపించే ద్రవ్య మద్దతు జీడీపీలో 1 శాతమేనని పేర్కొంది. కొవిడ్‌ వల్ల మందగమనం పాలైన ఆర్థిక వ్యవస్థకు ఊపిరులూదడానికి జీడీపీలో 10 శాతానికి సమానమైన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రధాని నరేంద్ర మోదీ ఈనెల 12న ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ ప్యాకేజీపై ఫిచ్‌ సొల్యూషన్స్‌ విడుదల చేసిన నివేదికలోని ముఖ్యాంశాలు..
* మే 13-17 మధ్య ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలో దాదాపు సగం మొత్తం అంతక్రితం ప్రకటించిన ద్రవ్య చర్యలను పేర్కొన్నారు. అందులో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి వెలువడిన పరపతి ఉద్దీపననూ జత చేశారు.

* ప్యాకేజీ మొత్తం ప్రభుత్వ రుణ హామీలు, బ్యాంకుల రుణాలు, నియంత్రణపరమైన సవరణలతో నిండిపోయింది. కొత్తగా ప్రకటించిన వ్యయాలు జీడీపీలో కేవలం 1 శాతంగానే ఉన్నాయి. మొత్తం మీద చూసుకుంటే ఇప్పటిదాకా కొవిడ్‌పై పోరుకు భారత్‌ కేటాయించింది జీడీపీలో 1.8 శాతం మాత్రమే.

* ఆర్థిక వ్యవస్థలోని తక్షణ ఆందోళనలకు ప్యాకేజీ పరిష్కారం చూపలేకపోయింది. అందుకే 2020-21 ఏడాదికి కేంద్ర, సంయుక్త ద్రవ్యలోట్లను వరుసగా 7%; 11 శాతానికి సవరించాం. అంతక్రితం అవి 6.2%, 9 శాతంగా ఉన్నాయి. ఈ ప్యాకేజీ జీడీపీలో 10 శాతంగా ఉందని ప్రభుత్వం అంటున్నా.. అది ద్రవ్య, ఆర్థిక ప్రభావాన్ని చూపబోదు.

* 2020-21లో భారత్‌ 1.8 శాతం వృద్ధిని నమోదు చేయొచ్చని అంతక్రితం మేం వేసిన అంచనాలు మరింత దిగువకు చేరే అవకాశం ఉంది.

* 2020-21లో ప్రభుత్వ ఆదాయాలు 18.1 శాతం మేర క్షీణించవచ్చు.

* నిరుద్యోగ రేటు 20 శాతానికి పైగా చేరడానికి తోడు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక భవిష్యత్‌ అంచనాలు బలహీనంగా ఉండడం వల్ల రాబోయే కొద్ది త్రైమాసికాల పాటు వ్యక్తిగత ఆదాయాలు, కార్పొరేట్‌ ఆదాయ పన్ను ఆదాయాలు తీవ్ర ఒత్తిళ్లలో కొనసాగనున్నాయి.

* లాక్‌డౌన్‌ తొలగించడం  వల్ల కరోనా వ్యాప్తి వేగవంతమై ఆర్థిక రికవరీని భవిష్యత్‌లో కుంటుపడేలా చేయొచ్చు. ఈ సంక్షోభం కారణంగా భారత రుణ-జీడీపీ నిష్పత్తి పెరగవచ్చు. దీంతో ప్రభుత్వం తన వ్యయాల కోసం దేశీయ రుణాలను పెంచుకోవాల్సి రావొచ్చు.


కంపెనీ                    జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలు
                    లాభం     (రూ.కోట్లలో)            ఆదాయం

                2019-20      2018-19           2019-20    2018-19
టాటా పవర్‌*       475          172           6881         7597
అపోలో టైర్స్‌        77.8        83.99          3607.74       4322.24
ఉజ్జీవన్‌స్మాల్‌ఫైనాన్స్‌   73.15       63.78          809.65       602.23
సనోఫి ఇండియా      85.4        92.9           784.5       717.3


* ప్రతి షేరుకు డివిడెండ్‌ రూ.1.55


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.