ఇంటివద్దకే మద్యం సరఫరా, ప్రారంభించిన స్విగ్గీ
close

తాజా వార్తలు

Published : 21/05/2020 22:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇంటివద్దకే మద్యం సరఫరా, ప్రారంభించిన స్విగ్గీ

ఝార్ఖండ్‌లో మొదలు...

దిల్లీ: ఆన్‌లైన్‌ ఆహార సరఫరా దిగ్గజం స్విగ్గీ, మద్యాన్ని వినియోగదారుల ఇంటికే అందించే సదుపాయాన్ని నేటి నుంచి ప్రారంభించింది. ప్రస్తుతానికి తమ సేవలు ఝార్ఖండ్‌లోని రాంచితో ప్రారంభమయ్యాయని నేడు విడుదల చేసిన ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. కాగా ఆ రాష్ట్రంలోని మరిన్ని పట్టణాలకు కూడా ఓ వారంలోగా తమ సేవలను విస్తరిస్తామని స్విగ్గీ వెల్లడించింది. కాగా, ఇతర రాష్ట్రాల్లో కూడా తమ సేవలను విస్తరించేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంస్థ ఉన్నతాధికారులు తెలిపారు.

తమ కంపెనీ యాప్‌లో ‘‘వైన్‌ షాప్స్‌’’ విభాగంలో ఆన్‌లైన్‌ మద్య సరఫరా సేవలు అందుబాటులో ఉంటాయని సంస్థ అధికారులు తెలిపారు. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు స్వీకరించి, వినియోగదారుల ఇంటి వద్దకే మద్యాన్ని సరఫరా చేసేందుకు గాను తాము లైసెన్సు, అవసరమైన ఇతర అనుమతులు కలిగిన స్థానిక దుకాణాలతో ఒప్పందాలు చేస్తున్నామని స్విగ్గీ వివరించింది. అమలులో ఉన్న లాక్‌డౌన్‌, కరోనా వైరస్ తదితర నిబంధనలను తాము పాటిస్తామని... వినియోగదారు చిరునామా, వయస్సు తదితర వివరాలు నిర్ధారించుకున్న అనంతరం మాత్రమే వారికి మద్యాన్ని అందచేస్తామని సంస్థ అధికారులు వివరించారు. 

ఈ విధంగా నిబంధనలకు లోబడి హోం డెలివరీ సేవలు అందించటం ద్వారా రిటైల్‌ మద్యం దుకాణాలకు కూడా అదనపు వ్యాపారాన్ని అందించినట్టు అవుతుందని స్విగ్గీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అంతేకాకుండా మాస్కులు, సామాజిక దూరం వంటి నిబంధనలు పాటించకుండా ప్రజలు గుమిగూడటం వంటి అవాంఛిత పరిణామాలను కూడా అరికట్టవచ్చని వారు తెలిపారు. 


Tags :

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని