close

తాజా వార్తలు

Published : 21/05/2020 20:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

టాప్‌ 10 న్యూస్‌ - 9 PM

1. తెలంగాణలో కరోనాతో ఈ రోజు ఐదుగురు మృతి

తెలంగాణలో ఈ రోజు కొత్తగా 38 కరోనా పాజటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1699కి చేరింది. ఈ ఒక్క రోజులోనే ఐదుగురు కరోనాతో మృతి చెందారు. వీరితో కలిపి ఇప్పటివరకు 45 మంది మృతి చెందారు. ఈ రోజు 23 మంది కోలుకోగా... ఇప్పటివరకు 1,036 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 618 యాక్టివ్‌ కేసులున్నాయి. ఈ రోజు నమోదైన కేసుల్లో 26 జీహెచ్‌ఎంసీ పరిధిలోనివి కాగా, రెండు రంగారెడ్డి జిల్లాకు చెందినవి. మిగిలిన 10 ఇతర ప్రాంతాలకు చెందినవారిగా గుర్తించారు. 

2. విశాఖలో దట్టమైన పొగలు.. బెంబేలెత్తిన ప్రజలు

విశాఖ పారిశ్రామిక ప్రాంతంలో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న హెచ్‌పీసీఎల్‌ రిఫైనరీలో ఎన్‌హెచ్‌యూను తెరిచేందుకు సంస్థ సన్నాహాలు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. వరంగల్‌లో నలుగురు వలస కార్మికులు మృతి

వరంగల్‌ జిల్లాలో నాలుగు మృతదేహాలు బావిలో బయటపడటం స్థానికులను భయాందోళనకు గురి చేసింది. శీతల గిడ్డంగి వద్ద బావిలో నలుగురు వలస కార్మికుల మృతదేహాలు బయటపడిన సంఘటన జిల్లాలోని గీసుకొండ మండలం గొర్రెకుంటలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ బంగాల్‌ నుంచి 20 ఏళ్ల క్రితం వచ్చిన వలస కార్మికులు మండలంలో స్థిరపడ్డారు. వీరంతా గోనెసంచుల తయారీ పరిశ్రమలో పనిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. ఆ పర్యవేక్షణ ప్రైవేటులో సాధ్యం కాదు:ఈటల

సాధారణ వ్యాధులతో పోలిస్తే కరోనా భిన్నమైనదని.. ఇలాంటి వ్యాధులకు చికిత్స అందించేందుకు ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిస్తే పేదలు ఇబ్బందిపడే అవకాశం ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ప్రాంగణంలో గ్రేస్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన మొబైల్ కొవిడ్‌ ఐసీయూని మాజీ మంత్రి లక్ష్మారెడ్డితో కలిసి ఈటల ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. ‘అంపన్‌’ బీభత్సం.. 84మంది మృతి 

బంగాళాఖాతంలో ఏర్పడిన అంపన్‌ పెను తుపాను బెంగాల్‌లో బీభత్సం సృష్టించింది. పశ్చిమ బెంగాల్‌, ఒడిశా, బంగ్లాదేశ్‌లను తీవ్ర స్థాయిలో కుదిపేసింది. ఈ తుపాను దాటికి బెంగాల్‌లో భారీ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. తుపాను తీరం దాటిన సమయంలో వీచిన భీకర గాలులు, భారీ వర్షాలకు 84మంది మృతిచెందగా.. అనేక మంది గాయపడ్డారు. ఒక్క బెంగాల్ రాష్ట్రంలోనే 72మంది మృతిచెందినట్టు సీఎం మమతాబెనర్జీ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. మానవత్వం చాటిన ‘నాలుగో సింహం’

ఇది కరోనా కాలం.. ఈ విపత్కర పరిస్థితుల్లో కొందరు పోలీసులు వినూత్నంగా కరోనాపై అవగాహన  కల్పించగా.. మరికొందరైతే తమ దృష్టికి వచ్చిన నిస్సహాయుల కష్టాలను మానవత్వంతో అర్థంచేసుకొని వాటిని తీర్చడం ద్వారా జనంతో ‘జయహో పోలీస్‌’ అనిపించుకున్నారు. కరోనా కష్ట కాలంలో మానవత్వాన్ని పరిమళింపజేసే ఇలాంటి ఘటనల సమాహారమే ఈ కథనం. కథనం కోసం క్లిక్‌ చేయండి 

7. భారత్‌లో క్రికెట్‌: ఎప్పటినుంచీ మొదలంటే...

భారత్‌లో క్రికెట్‌ కార్యకలాపాలు రుతుపవనాల అనంతరం మొదలుకాగలవని బీసీసీఐ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాహుల్‌ జోహ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) పోటీలు నిర్వహిస్తామని కూడా తెలిపారు. అయితే ఆటగాళ్ల భద్రతకే అత్యంత ప్రాధాన్యమనే విషయాన్ని జోహ్రీ మరోమారు స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రైల్వే స్టేషన్లలోనూ టికెట్‌ బుకింగ్స్

రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 1.7 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించారు. కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ అందుబాటులోకి లేని వారికి కూడా టికెట్‌ బుక్‌ చేసుకునే సదుపాయం కల్పించేందుకు ఈ సేవలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అలాగే, నిర్దేశిత రైల్వేస్టేషన్లలో సైతం రెండు మూడు రోజుల్లో బుకింగ్స్‌ ప్రారంభిస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కరోనాకు హైడ్రాక్సీ వాడకం... ఓకేనా?

మహమ్మారి కరోనా వైరస్‌ చికిత్సలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌ ఔషధాల వాడకాన్ని గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య హెచ్చరికలు జారీచేసింది. మలేరియా తదితర వ్యాధుల చికిత్సలో వాడుతున్న ఈ మందులను కొవిడ్‌-19 విషయంలో ఔషధ పరిశోధనలకు మాత్రమే పరిమితం చేయటం మంచిదని ఈ అంతర్జాతీయ సంస్థ ఉన్నతాధికారి ఒకరు సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. బిరియానీ ఆర్డర్‌ చేసుకున్న కరోనా రోగులు...



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.