close

తాజా వార్తలు

Published : 27/05/2020 15:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అనుష్కపై మంచులక్ష్మి ప్రశంసలు..!

వెంటనే మీరూ చూడండి

హైదరాబాద్‌: బాలీవుడ్‌ నటి అనుష్కశర్మపై నటి మంచులక్ష్మి ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల అనుష్క నిర్మాతగా క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌ పతాకంపై ‘పాతాళ్‌లోక్‌’ అనే వెబ్‌సిరీస్‌ రూపొందిన విషయం తెలిసిందే. క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి ఎన్నో ప్రశంసలు లభిస్తున్నాయి. తాజాగా ఈ సిరీస్‌ను వీక్షించిన మంచులక్ష్మి ట్విటర్‌ వేదికగా సదరు బృందానికి అభినందలు తెలిపారు. తప్పకుండా ప్రతిఒక్కరూ ఆ సిరీస్‌ను చూడాలని కోరారు.

‘అనుష్క శర్మ నిర్మాతగా వ్యవహరించిన ‘పాతాళ్‌ లోక్‌’ సిరీస్‌ గురించి నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. కథ రచించిన తీరు, స్ర్కీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, పరిణతి చెందిన నటీనటులు.. వావ్‌..! ఇలా ఈ సిరీస్‌లోని ప్రతి అంశం చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ మీరు కనుక ఇంకా ఈ సిరీస్‌ను వీక్షించకపోతే.. మీ పనులన్నింటినీ పక్కన పెట్టి వెంటనే ఈ సిరీస్‌ను వీక్షించండి’ అని మంచులక్ష్మి అన్నారు.

‘క్లీన్‌ స్లేట్‌ ఫిల్మ్స్‌’ను స్థాపించి నిర్మాతగా మారిన అనుష్క.. తాను కథానాయికగా తెరకెక్కిన పలు సినిమాలను ఆ బ్యానర్‌పై రూపొందించారు. ‘పాతాళ్‌లోక్‌’తో ఆమె మొదటిసారి నిర్మాతగా వెబ్‌ సిరీస్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ఇందులో నీరజ్‌ కబీ, గుల్‌ పనాగ్‌, అభిషేక్‌ బెనర్జీ ముఖ్యపాత్రలు పోషించారు. అనివాష్‌ అరుణ్‌ దర్శకత్వం వహించారు.

 



Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.