close

తాజా వార్తలు

Updated : 28/05/2020 00:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నీతో వచ్చేది ఏది?

క్రీస్తువాణి

‘‘మీరు ఎలాంటి ప్రలోభాలకూ గురికావద్ధు ఒకరి కలిమి విస్తరించడం అతడి జీవానికి మూలం కాదు’’... ఇది క్రీస్తు చెప్పిన ప్రసిద్ధ ఉపమానం.

క వ్యక్తి లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? అంటారు ప్రభువు. జీవితం ఒక్కసారే మనకు దొరికిన అమూల్యమైన బహుమానం. దాన్ని పోగొట్టుకుంటే.. తిరిగి తీసుకురాలేం. ఇహలోక సంపదలు అక్రమంగా కూర్చుకునే క్రమంలో మనిషి అధోగతి పాలవుతాడు. ఆ ఆందోళన అంతులేని ఘర్షణను మిగులుస్తుంది. సంపాదనంతా భూమ్మీద ఉండిపోతుంది. రక్తసంబంధీకులు సమాధి వరకే వస్తారు. తుదకు మన వెంట వచ్చేది ఏంటి? అని ప్రతి ఒక్కరూ పునరాలోచించుకోవాలంటారాయన.

ఒక మహాచక్రవర్తి సమస్త భూమండలాన్ని జయించాడు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యాడు. తను చనిపోయే సమయం ఆసన్నమైందని చక్రవర్తికి అర్థమైంది. తనవారిని పిలిచాడు. ‘‘చనిపోయాక నా అంతిమయాత్రలో నా చేతులు బయటకు కనిపించేలా ఉంచండి. నలుగురు ప్రసిద్ధ వైద్యులు నా శవపేటికను మోయాలి. అంతిమ ప్రస్థాన సమయంలో పేదలకు బంగారు నాణేలను పంచాలి’’ అని చెప్పాడు.

ఆ మాటలకు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇదంతా దేనికని ప్రశ్నించారు. దానికాయన ‘‘నేను ఎన్ని రాజ్యాలు జయించినా.. ఎన్ని ధనరాశులు సంపాదించినా.. వెళ్లేది ఖాళీ చేతులతోనే! ఈ విషయం ప్రపంచానికి తెలియాలి. అలాగే ఎంత డబ్బున్నా.. చావు అనివార్యమైనపుడు ఏ గొప్ప వైద్యుడూ మరణాన్ని దూరం చేయలేడు.. ఈ జీవిత సత్యం కూడా అందరికీ అర్థం కావాలి. అలాగే ఆఖరిసారిగా మనం చేసే దానధర్మాలే మన వెంట వచ్చేవన్న గొప్ప విషయం నా చివరి సందేశం కావాలి’’ అని బదులిచ్చాడు.

ఒక వ్యక్తి గొప్పదనాన్ని నిర్ణయించేది అతని సంపదలు కాదు. అతడి వ్యక్తిత్వం, సుగుణశీలత.

‘‘మనం జీవితంలో దివ్యమైన, ఉన్నతమైన వాటిని మన స్వభావంగా పొందాల’’ంటారు క్రీస్తు.

నైతికత, జ్ఞానం, సహనం వల్ల మనిషికి అందరినీ సమదృష్టితో చూసే గుణం వస్తుంది. ఫలితంగా సమస్త జీవులపై ప్రేమ, కరుణ, వాత్సల్యం ఏర్పడతాయి.

ఇవే చివరకు మనిషికి మిగిలేవి. అతని వెంట వచ్చేవి.

- ఎం.సుగుణరావు


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.