close

తాజా వార్తలు

Published : 28/05/2020 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రూ.1,000 కోట్ల రైట్స్‌ ఇష్యూ

ముంబయి: ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ ఈ ఆర్థిక సంవత్సరంలో నిధుల సమీకరణ కోసం రూ.1,000 కోట్ల రైట్స్‌ ఇష్యూకు రాబోతోంది. బుధవారం జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశం ఇందుకు ఆమోదం తెలిపింది. ప్రమోటర్లు/ప్రమోటరు గ్రూపు ఈ ఇష్యూలో జారీ చేసే 100 శాతం షేర్లను కొనుగోలు చేస్తారని సమాచారం. రుణాలు తగ్గించుకోవడంతో పాటు ఆస్తి-అప్పుల పట్టీని బలోపేతం చేయడం, ఇతర కార్పొరేట్‌ వ్యయాల కోసం ఈ నిధుల్ని ఖర్చు చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రతిపాదిత ఇష్యూ ఎప్పుడు ఉంటుంది? షేరు ధర ఎంత? వంటి ఇతర వివరాలు నిర్ణయించడానికి బోర్డు ఓ కమిటీని నియమించింది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ వస్త్ర పరిశ్రమలో దిగ్గజ సంస్థగా కొనసాగుతోంది. బలమైన బ్రాండ్లతో పెద్ద పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తోంది. ఈ సంస్థ దేశ వ్యాప్తంగా 3,040 దుకాణాలతో పాటు 25,000 మల్టీ-బ్రాండ్‌ అవుట్‌లెట్లలో తన ఉనికిని కలిగి ఉండటం విశేషం.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.