close

తాజా వార్తలు

Published : 28/05/2020 02:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2021-22లో వృద్ధిరేటు 5 శాతానికి

ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు

ముంబయి: దేశ వృద్ధిరేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 5 శాతానికి పెరగొచ్చని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు -5 శాతంగా నమోదు కావచ్చని రేటింగ్‌ సంస్థలు  క్రిసిల్‌, ఫిచ్‌ పేర్కొన్న నేపథ్యంలో, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘కొవిడ్‌-19 అనేది ప్రకృతి విపత్తు కాదు. మన కర్మాగారాలు పనిచేస్తూనే ఉన్నాయి. మౌలిక వ్యవస్థలు, రవాణా రంగాలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పూర్తిగా తెరిచాక, ఆర్థిక వ్యవస్థ చురుకుగా సాగుతుంది. అందువల్ల వచ్చే ఆర్థికంలో 5 శాతం వృద్ధిరేటు సాధ్యమే’ అని భావిస్తున్నట్లు ఒక వెబినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. 2021-22లో 5-6 శాతం వృద్ధిరేటు సాధ్యమేనని ప్లానింగ్‌ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ మాంటెక్‌సింగ్‌ అహ్లూవాలియా చెప్పారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.