close

తాజా వార్తలు

Published : 29/05/2020 00:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కప్పులతో గోల్‌!

గోల్‌ ఏంటి? కప్పులేంటి? అసలేంటీ ఆట.. ఫుట్‌బాల్‌, హాకీ, బాస్కెట్‌బాల్‌, రగ్బీలాంటి ఆటల్లో కదా.. గోల్‌ ఉండేది! కప్పులతో గోల్‌ ఎలా?! అసలు ఈ గోల్‌గోల ఏంటి అనుకుంటున్నారా?! ఏం లేదు ఫ్రెండ్స్‌ మీరు ఈరోజు ఓ కొత్త ఆట నేర్చుకోబోతున్నారు. ఇంకెందుకాలస్యం చదివేయండి మరి!

ఆట ఆడాలంటే కొన్ని పేపర్‌ కప్పులు, రెండు స్ట్రాలు, ఒక బల్ల, టేప్‌, టాస్‌ వేసుకోవడానికి ఓ నాణెం ఉండాలి.

* ముందుగా బల్లపై చిత్రంలో చూపించినట్లు టేప్‌సాయంతో ఓ కోర్టు తయారు చేసుకోవాలి.

* ఈ ఆట ఇద్దరు ఆడాలి.. కాబట్టి ప్రారంభానికి ముందు టాస్‌ వేయాలి.

* ఇద్దరూ బల్లకు ఇరువైపులా నిల్చోవాలి. టాస్‌ గెలిచిన వారు ముందు ఆటను ఆరంభిస్తారు.

* గోల్‌పోస్టులో ఓ కాగితపు కప్పును పెట్టాలి.

* నోట్లో స్ట్రాను పెట్టుకుని ఊదుతుండాలి. అప్పుడు కప్పు ముందుకు వెళుతుంది. ఇలా మధ్యలో గీతను దాటి అవతలవారి పక్కకు పోవాలి.

* అప్పుడు అవతల వాళ్లూ.. స్ట్రాతో దాన్ని ఊదాలి.

* అంటే ఒకరు గోల్‌ కొట్టాలని చూస్తే.. మరొకరు ఆపడం అన్నమాట.

* ఎవరైతే అవతలవారి గోల్‌పోస్టులోకి కప్పును నెట్టగలుగుతారో వారు గెలిచినట్లు.

* గోల్‌పోస్టులోకి కప్పు వెళ్లగానే దాన్ని నలిపి ఓడిపోయిన వారు గెలిచినవారికి ఇవ్వాలి.

* అయిదు నిమిషాలు, పది నిమిషాలు.. ఇలా సమయం కేటాయించుకుని.. ఆ లోగా ఎవరెన్ని గోల్స్‌ కొడితే వాళ్లు గెలిచినట్లు!

* మీరు ఆడుతుండగా వీడియో తీసి మీ అమ్మానాన్నను సోషల్‌ మీడియాలో పోస్టు చేయమని చెప్పండి.

* ఇలా మీరు ‘కప్‌ గోల్‌’ ఛాలెంజ్‌ను ఎంచక్కా.. ఇతరులకు విసరొచ్ఛు.

* భలే ఉంది కదూ! ఆడేయండి మరి.. ఇంకెందుకాలస్యం..!

ప్రయోజనం:

1. ఊపిరితిత్తుల సామర్థ్యం పెరుగుతుంది

2. ఏకాగ్రత మెరుగవుతుంది.

3. పోటీతత్వం అలవడుతుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.