close

తాజా వార్తలు

Updated : 30/05/2020 11:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మీ త్యాగాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు: షా

దిల్లీ: 2019లో రెండోసారి గద్దెనెక్కిన ఎన్డీఏ సర్కారు శనివారం ఏడాది పాలనను పూర్తి చేసుకున్న తరుణంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భాజపా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. గత ఆరు సంవత్సరాలుగా ప్రభుత్వం సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలను వారు ప్రతి ఇంటికి చేరవేసే పనిలో ఉన్నారని ట్విటర్ వేదికగా ప్రశంసించారు.

‘ఈ చరిత్రాత్మకమైన రోజున కోట్ల సంఖ్యలో ఉన్న భాజపా కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గత ఆరు సంవత్సరాలుగా మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను, ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేరేలా చూస్తున్నారు. మీ కృషి, త్యాగాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. అలాగే ‘1ఇయర్ఆఫ్‌మోదీ2’ హ్యాష్ ట్యాగ్‌ను జత చేశారు. మొదటి ఏడాది మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను గుర్తుచేస్తూ భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.  

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి, ఏడాది పూర్తవుతున్న సందర్భంగా మోదీ ప్రజలనుద్దేశించి బహిరంగ లేఖ రాశారు. గతేడాది భారత ప్రజాస్వామ్యంలో ‘గోల్డెన్‌ ఛాప్టర్’ ప్రారంభమైందన్నారు. ఆ ఎన్నికల్లో భారత ప్రజలు ప్రజాస్వామ్య శక్తిని ప్రపంచానికి చాటారన్నారు. ఈ వార్షికోత్సవ సమయంలో భారత్ కరోనా వైరస్‌తో పోరాడుతోందని, ఇది మానవ సంక్షోభానికి దారి తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వలస కార్మికులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొనేవారు, ఇతర రంగాలకు చెందిన ఎంతో మంది ఉపాధి కోల్పోయారని, వారి కష్టాలను తొలగించడానికి దృఢచిత్తంతో పనిచేస్తున్నామని మోదీ వెల్లడించారు. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.