close

తాజా వార్తలు

Published : 31/05/2020 00:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

త్వరలోనే స్వావలంబన భారత్‌: పవన్‌

అమరావతి: ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో భారత్‌ త్వరలోనే స్వావలంబన కలిగిన దేశంగా అవతరించబోతోందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ప్రధాని మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన శనివారం ట్వీట్‌ చేశారు.

ఈ ఏడాది కాలంలో దేశం ఎన్నో చారిత్రక, ఎన్నో సాహసోపేత నిర్ణయాలను చూసిందని పవన్‌ అన్నారు. త్వరలోనే భారత్‌ స్వావలంబన సాధించి తీరుతుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. ఈ 21వ శతాబ్ది భారత్‌దేనని చెప్పారు. ముందు చూపు, ధైర్యసాహసాలు కలిగిన ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో అది సాధ్యం కానుందని పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.