close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 00:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

చలచల్లని సబ్జా..

వేసవిలో చల్లదనం కోసం సబ్జా గింజలు వేసిన ఫలూదాను హాయిగా తాగేస్తుంటాం. చల్లదనమే కాదు.. సబ్జాగింజల వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి.

వేడిని తగ్గిస్తుంది: నీళ్లలో సబ్జాగింజలు వేసుకుని కాస్త పంచదార లేదా తేనె కలిపి తాగితే ఎండ వేడి నుంచి రక్షించుకోవచ్ఛు నిమ్మకాయ నీళ్లు, షర్బత్‌లు, మిల్క్‌షేకుల్లో చల్లదనం కోసం సబ్జా గింజలను కలిపి తాగొచ్ఛు

బరువు నియంత్రణ: వీటిలో పీచు ఎక్కువగా ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎక్కువ సేపు ఆకలి వేయదు. బరువు తగ్గుతారు.

* ఫ్రూట్‌ సలాడ్‌లో కాసిన్ని సబ్జాగింజలు వేసుకుని తీసుకుంటే మధ్యాహ్నం ఎక్కువ అన్నం తినలేరు. అలా అధిక బరువు నియంత్రణకు ఇవి తోడ్పడతాయి.

* శరీరంలోని వ్యర్థాలను సహజసిద్ధంగా బయటకు పంపడానికి సబ్జా తోడ్పడుతుంది. రాత్రి పాలల్లో కొన్ని సబ్జాగింజలు వేసుకుని తాగితే మలబద్ధకం ఉండదు.

* రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తాయివి. పిండిపదార్థాలు గ్లూకోజ్‌గా మారకుండా సాయపడతాయి.

* వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. దగ్గు, జలుబు నుంచి ఉపశమనం కలిగిస్తాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.