close

తాజా వార్తలు

Updated : 31/05/2020 22:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ప్రమోటర్‌ హోదా నుంచి మధుకపూర్‌ గ్రూప్‌ బయటకు

ముంబయి: యెస్‌ బ్యాంక్‌లోని ప్రమోటర్‌ హోదా నుంచి బయటకు వచ్చేందుకు మధుకపూర్‌ గ్రూప్‌ అంగీకరించినట్లు బీఎస్‌ఈకి శనివారం అందజేసిన ఫైలింగ్‌లో బ్యాంక్‌  పేర్కొంది. దీంతో మధుకపూర్‌ గ్రూప్‌ నాన్‌ ప్రమోటర్‌ లేదా పబ్లిక్‌ షేర్‌ హోల్డర్‌గా కంపెనీలో కొనసాగనుంది. ఈ మేరకు అనుమతులు కోరుతూ ఈ ఫైలింగ్‌ను బీఎస్‌ఈకు అందజేశారు. మార్చి 31నాటికి కంపెనీలో మధుకపూర్‌కు 1.12శాతం వాటాలు ఉండగా.. మాగ్స్‌ ఫిన్‌వెస్ట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు 0.30శాతం వాటాలు ఉన్నాయి. 

స్టేట్‌బ్యాంక్‌ నేతృత్వంలోని కన్సార్టియం రూ.10వేల కోట్ల యెస్‌బ్యాంక్‌కు బెయిలౌట్‌ చేసిన మూడునెలల తర్వాత ఈ మార్పు చోటు చేసుకోవడం గమనార్హం. ప్రభుత్వానికి చెందిన ఎస్‌బీఐకు మెజార్టీ వాటా దక్కింది. దీంతోపాటు పలు ఆర్థిక సంస్థలకు, ప్రైవేటు బ్యాంకులు కూడా పెట్టుబడి పెట్టాయి. 


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.